KTR: కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో తేల్చుకోండి
ABN , First Publish Date - 2023-11-27T13:29:07+05:30 IST
కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారని.. అసలు రైతులు ఎలాంటి మోటారు వాడతారో తెలియని పార్టీకి ఓటేద్దామా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నేడు ఆయన వెల్గటూర్ మండల కేంద్రంలో బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు.
జగిత్యాల: కాంగ్రెస్ నాయకులు మూడు గంటల కరెంట్ చాలని అంటున్నారని.. అసలు రైతులు ఎలాంటి మోటారు వాడతారో తెలియని పార్టీకి ఓటేద్దామా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నేడు ఆయన వెల్గటూర్ మండల కేంద్రంలో బీఅర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఅర్ మాట్లాడుతూ.. కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని కేటీఆర్ అన్నారు.
11 ఛాన్సులు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. మళ్లీ ఒక్క ఛాన్స్ అంటూ వస్తోందన్నారు. ప్రజలు ఆలోచించండి.. అగం కాకుండ్రని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే.. తెలంగాణ రాష్ట్రం చచ్చిపోతుందన్నారు. దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధర్మపురి నియోజక వర్గంలో దళిత బంధు పథకం ఇంటింటా అందజేస్తామన్నారు. స్తంబంపల్లి వద్ద ఇథనాల్ ప్రాజెక్ట్ రద్దు చేసి, వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేశామని కేటీఆర్ వెల్లడించారు.