PM Modi : 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్న మోదీ..
ABN , First Publish Date - 2023-11-11T13:47:00+05:30 IST
PM Modi : 25 నుంచి 3 రోజులపాటు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణకు ప్రధాని మోదీ రానున్నారు. ఇప్పటికే తెలంగాణలో సభ నిర్వహించిన మోదీ నేడు మళ్లీ రానున్నారు. ఇక 25 నుంచి అయితే మూడు రోజుల పాటు ఉండి ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచనున్నారు. 25న కరీంనగర్, 26న నిర్మల్‌లో జనగర్జనసభ నిర్వహించనున్నారు. 27న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఎల్బీనగర్ నుంచి పటాన్‌చెరు వరకూ మోదీ రోడ్‌షోకు బీజేపీ ప్లాన్ చేస్తున్నారు.
హైదరాబాద్ : నవంబర్ 25 నుంచి 3 రోజులపాటు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) పర్యటించనున్నారు. ఇప్పటికే తెలంగాణలో సభ నిర్వహించిన మోదీ నేడు మళ్లీ రానున్నారు. ఇక 25 నుంచి అయితే మూడు రోజుల పాటు ఉండి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో జోష్ పెంచనున్నారు. 25న కరీంనగర్, 26న నిర్మల్‌లో జనగర్జనసభ నిర్వహించనున్నారు. 27న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఎల్బీనగర్ నుంచి పటాన్‌చెరు వరకూ మోదీ రోడ్‌షోకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.
నేడు తెలంగాణకు మోదీ..
ప్రధాని మోదీ శనివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి ఆయన వస్తున్నారు. మోదీ ఈరోజు సాయంత్రం 4.45 గంలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 5 గంటలకు రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్‌కు బయలుదేరతారు. 5 గంటల నుంచి 5.45 గంటల వరకు పెరేడ్ గ్రౌండ్స్ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తిరిగి 5.55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని.. 6 గంటలకు ఢిల్లీకి బయలుదేరి వెళతారు.
ఎస్సీ వర్గీకరణ ప్రకటించే అవకాశం..
తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన బీజేపీ పెద్దలు, తాజాగా ఎస్సీ వర్గీకరణపై చట్టబద్ధత అంశానికి అనుకూలంగా కీలక నిర్ణయం తీసుకున్నారా? సాక్షాత్తు ప్రధాని మోదీయే ఎస్సీ వర్గీకరణపై ఓ ప్రకటన చేసే అవకాశం ఉందా? విశ్వసనీయ సమాచారం ప్రకారం వీటికి ‘ఔను’ అనే సమాధానమే వస్తోంది! శనివారం సికింద్రాబాద్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ‘అణగారిన వర్గాల విశ్వరూప మహాసభ’కు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ వేదికపై నుంచే ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయాన్ని మోదీ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, దీనిపై వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని, అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేస్తామని ప్రధాని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాష్ట్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన బీసీల సభకు మోదీ వచ్చిన సందర్భంగా ఆయనతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ భేటీ అయ్యారు. ఆ సమయంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించారు. షెడ్యూలు కులాల వర్గీకరణపై మోదీ కొంత సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘విశ్వరూప సభ’కు మోదీ హాజరుకానుండటంతో వర్గీకరణ అంశమ్మీద ఆయన ప్రకటన చేస్తారనే బీజేపీ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.