Share News

PM MODI: 4 రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2023-11-08T17:17:44+05:30 IST

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. దళితులకు భరోసా ఇవ్వనున్నారు.

PM MODI: 4 రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. దళితులకు భరోసా ఇవ్వనున్నారు. ఈనెల 11న తెలంగాణకు ప్రధానమంత్రి మోదీ వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

మినిట్ టూ మినిట్ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

11వ తేదీ సాయంత్రం 4.45 నిమిషాలకు మోదీ బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు. 5 గంటలకు రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్ కు మోదీ చేరుకుంటారు. 5 గంటల నుంచి 5.45వరకు పెరేడ్ గ్రౌండ్స్ సభలో మోదీ ప్రసంగిస్తారు. 5.55 నిమిషాలకు తిరిగి బేగంపేట విమానాశ్రయానికి మోదీ చేరుకోనున్నారు. 6 గంటలకు బేగంపేట నుంచి మోదీ ఢిల్లీకి వెళ్తారని బీజేపీ నేతలు వెల్లడించారు.

Updated Date - 2023-11-08T17:21:47+05:30 IST