Share News

Telangana Elections: రికార్డు స్థాయిలో నేషనల్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ కంప్లైంట్స్.. 48 గంటల్లోనే క్లియర్

ABN , First Publish Date - 2023-11-15T13:11:19+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా నేషనల్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ ఫిర్యాదులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. 119 సెగ్మెంట్లలో వందల సంఖ్యలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి.

Telangana Elections: రికార్డు స్థాయిలో నేషనల్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ కంప్లైంట్స్.. 48 గంటల్లోనే క్లియర్

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేల ఎలక్షన్ కమిషన్‌కు భారీగా ఫిర్యాదు వస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా నేషనల్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ (National Grievance Redressal System) ఫిర్యాదులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. 119 సెగ్మెంట్లలో వందల సంఖ్యలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తున్నట్లు రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు పరస్పర ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 20 వేలకుపైగా ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ ఫిర్యాదులపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే స్పందిస్తోంది. వచ్చిన ప్రతీ కంప్లైంట్స్‌‌ను 24 గంటల నుంచి 48 గంటల్లో ఈసీ క్లియర్ చేసేస్తోంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఒక్కో జిల్లాలో ఫిర్యాదులు 3 వేలు దాటాయి. అటు ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో 5 వందలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. వచ్చిన ఫిర్యాదుల్లో 416 పెండింగ్‌‌లో ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. అధికారుల పనితీరు, అక్రమ కేసులు, అధికార పార్టీపై ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి.

Updated Date - 2023-11-15T13:11:27+05:30 IST