Share News

Revanth Reddy : కేసీఆర్.. గజ్వేల్ వదిలి కామారెడ్డికి ఎందుకొచ్చావ్ : రేవంత్

ABN , First Publish Date - 2023-11-10T17:33:50+05:30 IST

కామారెడ్డి సభలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవిష్యత్‌ను కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని, BRSకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

Revanth Reddy : కేసీఆర్.. గజ్వేల్ వదిలి కామారెడ్డికి ఎందుకొచ్చావ్ : రేవంత్

కామారెడ్డి కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ సభలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్తు కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారని తెలిపారు.

రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. BRSకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశం ఆసక్తిగా చూస్తోందన్నారు.

"తెలంగాణ భవిష్యత్‌ను కామారెడ్డి ప్రజలు నిర్ణయించబోతున్నారు. BRSకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు కోసం దేశం ఆసక్తిగా చూస్తోంది. గజ్వేల్‌ ప్రజలను కేసీఆర్‌ పదేళ్లపాటు మోసం చేశారు. కామారెడ్డి భూములపై కేసీఆర్‌ కన్నుపడింది.. అందుకే పోటీ చేస్తున్నారు." అని రేవంత్ రెడ్డి అన్నారు.

"కేసీఆర్ మాది ఇదే ఊరని చెప్తున్నారు. కోనాపూర్‌లో నీ తల్లి గారి ఊరే అయితే ఆత్మహత్య చేసుకున్న రైతులను ఎందుకు ఆదుకోలేదు. కామారెడ్డిని బంగారు తునక చేస్తా అంటున్న నువ్వు గజ్వేల్‌లో ఏం చేసినవు?. గజ్వేల్ ప్రజలు నీకు అండగా ఉంటే కామారెడ్డికి ఎందుకు వచ్చినవ్. కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్‌తో భూములు కొల్లగొట్టడానికి వస్తున్నారు. షబ్బీర్ అలీ ఓడినా, గెలిచినా మీ వెంటే ఉన్నారు. గంప గోవర్ధన్ తన సీటు పోయిందని ఏడుస్తున్నారు. రెండుసార్లు సీఎం అయి లక్ష కోట్లు సంపాదించారు. ఆయన మనవడికి మంత్రి పదవి కోసం మరోసారి సీఎం అవుతాడట. కేసీఆర్ ను బొంద పెట్టాలని కామారెడ్డిలో పోటీ చేస్తున్నా. షబ్బీర్ అలీ, ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇక్కడ నామినేషన్ వేశాను. 40 మంది ఎమ్మెల్యేలను, 12 మంది ఎమ్మెల్సీలను, ఇద్దరు ఎంపీలను కొన్న కేసీఆర్ నాపై ఆరోపణలు చేస్తాడా. ఈ కొనుగోళ్లపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నా.. నువ్వు సిద్ధమా?. సీబీఐ కి లేఖ రాయి.. లేకపోతే కామారెడ్డిలో ముక్కు నేలకు రాయి. కామారెడ్డి ప్రజల సంక్షేమం, అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా." అని రేవంత్ రెడ్డి అన్నారు.

Updated Date - 2023-11-10T17:46:35+05:30 IST