Share News

CLP Meet: తెలంగాణ నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. ఈ రోజు ఎన్ని గంటలకంటే..

ABN , First Publish Date - 2023-12-04T15:30:35+05:30 IST

తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం ఈ రోజే (సోమవారం) జరగనుంది. రాత్రి 8.30 గంటల కార్యక్రమాన్ని నిర్ణయించేందుకు కాంగ్రెస్ పార్టీ ముహూర్తం నిర్ణయించింది. రాజ్ భవన్‌లోని దర్బార్ హల్‌లో సీఎంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేయనున్నారు.

CLP Meet: తెలంగాణ నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్.. ఈ రోజు ఎన్ని గంటలకంటే..

హైదరాబాద్: తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం ఈ రోజే (సోమవారం) జరగనుంది. రాత్రి 8.30 గంటల కార్యక్రమాన్ని నిర్ణయించేందుకు కాంగ్రెస్ పార్టీ ముహూర్తం నిర్ణయించింది. రాజ్ భవన్‌లోని దర్బార్ హల్‌లో సీఎంతోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేయనున్నారు. ఈ మేరకు జీఏడీ (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) నుంచి గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందింది. కాగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న దర్బార్ హాల్‌లో 175 మందికి వెసులుబాటు ఉంటుంది. దీంతో మిగతా వారికి ఎక్కడ ఏర్పాట్లు చేయాలన్న దానిపై జీఏడీ అధికారుల కసరత్తు చేస్తున్నారు.

ఇదిలావుండగా తదుపరి సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపనుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు నిర్ణయం వెలువడలేదు. సీఎల్పీ నేత ఎంపికను అధిష్ఠానికే అప్పగిస్తున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం ఉదయమే నిర్ణయించిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-12-04T17:08:37+05:30 IST