Share News

TS Elections: పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బీఆస్ఎస్- కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జ్

ABN , First Publish Date - 2023-11-30T15:58:00+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లను తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బీఆస్ఎస్- కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.

TS Elections: పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బీఆస్ఎస్- కాంగ్రెస్ కార్యకర్తల ఘర్షణ.. పోలీసుల లాఠీఛార్జ్

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లను తమ ఓటును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బీఆస్ఎస్- కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.

వివరాల్లోకి వెళ్తే.. మల్కాజిగిరి నియోజకవర్గం లోని మౌలాలి డివిజన్ ఆడమ్స్ స్కూల్ వద్ద టిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు అనుచరులు తమ కార్యకర్తలపై దాడి చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆడమ్స్ స్కూల్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

వరంగల్ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గం మైలారంలో టెన్షన్ మొదలైంది. రాయపర్తి మండలం మైలారం పోలింగ్ కేంద్రం దగ్గర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు అనుకూలంగా-వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. ఇరువురిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. రెండు వర్గాలు పరస్పర దాడికి దిగాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారు గుగులోతు యాకన్న, చిర్ర శీనుగా పోలీసులు గుర్తించారు.

సిద్ధిపేట జిల్లా: చేర్యాల మండలం ఆకునూర్‌లో ఓటర్లు ఆందోళనకు దిగారు. పట్టణ ప్రాంతాల నుంచి గ్రామాలకు రప్పించి ఓట్లు వేస్తే డబ్బులు ఇస్తామని బీఆర్ఎస్ నాయకులు మోసం చేశారని ఓటర్లు గ్రామంలో ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటలైన ఓటర్ స్లిప్ లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తూస్తున్నారని ఓటర్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఆకునూర్ రోడ్డుపై ఆందోళన చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టి ఓట్లు వేసేందుకు ఓటర్లను పోలీసులు పంపించారు.

Updated Date - 2023-11-30T15:59:49+05:30 IST