Share News

TS Assembly: స్పీకర్‌ని ఎంపిక చేసేది ఎప్పుడంటే..?

ABN , First Publish Date - 2023-12-09T15:36:11+05:30 IST

తొలిరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశం (Telangana Assembly Session) ముగిసింది. శనివారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారభమయ్యాయి. ఈ సభలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్‌ అక్బరుద్దీన్ ఓవైసీ (Protem Speaker Akbaruddin Owaisi) కొత్త ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

TS Assembly:  స్పీకర్‌ని ఎంపిక చేసేది ఎప్పుడంటే..?

హైదరాబాద్: తొలిరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశం (Telangana Assembly Session) ముగిసింది. శనివారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారభమయ్యాయి. ఈ సభలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్‌ అక్బరుద్దీన్ ఓవైసీ (Protem Speaker Akbaruddin Owaisi) కొత్త ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే స్పీకర్ ఎన్నికల కోసం బులెటిన్ విడుదల చేశారు. స్పీకర్ నామినేషన్ల కోసం రెండు రోజుల గడువు ఇచ్చారు. ఈనెల 14వ తేదీన గురువారం తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 15వ తేదీన (గురువారం) రోజు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 16వ తేదీన (శుక్రవారం) రోజు అసెంబ్లీ, మండలి జాయింట్ సెషన్ సమావేశం ఉంటుంది. సమావేశం అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించనున్నారు. శనివారం రోజు గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాదాలు చేస్తూ తీర్మానం చేస్తారు. ఈ తీర్మానానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమోదిస్తారు. కొత్త స్పీకర్ ఎన్నికయ్యేదాకా ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ కొనసాగనున్నారు.

Updated Date - 2023-12-09T17:37:08+05:30 IST