Revanth Reddy: రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. కార్నర్ మీటింగ్‌లో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2023-02-28T21:31:58+05:30 IST
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కార్నర్ మీటింగ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కార్నర్ మీటింగ్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. రేవంత్ రెడ్డి సభపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. రేవంత్‌రెడ్డి గోబ్యాక్ అంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు (BRS workers) నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ కార్యకర్తలపైకి కాంగ్రెస్ కార్యకర్తలు తిరిగి రాళ్లు రువ్వారు. ఉద్రిక్తత మధ్య రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ కొనసాగింది. రేవంత్‌రెడ్డి మీటింగ్ జరిగే ప్రాంతానికి భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. రేవంత్ రెడ్డిపై దాడికి సిద్ధమైన బీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లు, టమాటాలతో కార్నర్ మీటింగ్ పక్కనే ఉన్న ఊర్వశి థియేటర్‌లో మోహరించారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను థియేటర్ నుంచి బయటకు రాకుండా గేటుకు తాళం వేశారు.
పరకాలలో కార్నర్ మీటింగ్ స్థానికులతో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.''
‘పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి పేరులోనే ధర్మం ఉంది.. బుద్ధిలో లేదు.. దం దాల ధర్మారెడ్డి అని పిలవాలి’’అని టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నా రు. ఇందిరమ్మ రాజ్యం వస్తే నే పేదల కష్టాలు తీరుతాయని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం క ల్పించాలని రేవంత్ కోరారు. సోమవారం నడికూడ మండలం కంఠాత్మకూరు, ధర్మారం, నడికూడ, పులిగిల్ల, రాయపర్తిలలో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం పరకాల మండలం పులిగిల్ల గ్రామంలోని సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు చెల్లించి అక్కడినుండి హాథ్ సే హాథ్ జోడో యాత్రను 15వ రోజు పునఃప్రారంభించారు. పులిగిల్ల, రాయపర్తి, నర్సక్కపల్లి, మల్లక్కపేట మీదుగా యాత్ర పరకాలకు చేరుకుంది. పట్టణంలోని బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో రేవంత్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
పోరాటాల గడ్డ.. పోరాటాలకు అడ్డా.. రజాకార్లకు ఎదురొడ్డి తుపాకీగుండ్లకు భయపడకుండా ప్రాణాలనుసైతం లెక్కచేయని ఈ గడ్డ నుంచి చెబుతున్నా.. తెలంగాణ నుంచి కల్వకుంట్ల కుటుంబాన్ని బహిష్కరిస్తున్నానని అ న్నారు. ఇలాంటి గడ్డపై దందాలరెడ్డి ప్రతీ కాంట్రాక్టు తనదే అంటూ టెండ ర్లు, భూములు దోపిడీ చేశారని ఆరోపించారు. పరకాల నియోజకవర్గంలో 30వేల ఓట్లుంటే 10వేల ఓట్లు దళితులవేనని, అందులో ఏ కుటుంబానికైనా డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇచ్చినవా అని ప్రశ్నించారు. కొట్లాడి తెచ్చుకున్న తె లంగాణ రాష్ట్రంలో కేసీఆర్ 23లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని అన్నా రు. ఎన్నికల్లో గెలిచేందుకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు, మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, గొర్రెల పం పిణీ ఇలా.. ఎన్నో హామీలిచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, పావలావడ్డీ రుణాలు మహిళా సంఘాలు ఎక్కడికక్కడ కుంటుపడిపోయాయని అన్నారు.
కొండా సురేఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే నేటికీ పరకాలలో కనిపిస్తోందని పేర్కొన్నారు. నేడు కాంగ్రె్‌సకు ప్రజాదరణ చూసి టీఆర్‌ఎస్ నాయకుల్లో వణుకు పుట్టిందని, దమ్ము, ధైర్యం ఉంటే డ్రామారావు, నీ అయ్య కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నెట్టెంపాడు, దేవాదుల ప్రాజెక్టులు కట్టించామని పేర్కొన్నారు. కేసీఆర్ గ్రామం చింతమడకలో కూడా నేటికీ బడి, గుడి కాంగ్రెస్ హయాంలో కట్టించినవేనని అన్నారు. హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ, శిల్పారామం, మెట్రో రైలు కాంగ్రెస్ తెచ్చినవేనన్నారు.
తెలంగాణ ఉద్యమంలో 1200మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకుని ఉద్యమకారుల కుటుంబాలను ఏ ఒక్కనాడు పలకరించి బుక్కెడు బువ్వపెట్టిన రోజులేదని అన్నారు. తెలంగాణలోని నాలుగుకోట్ల ప్రజలు మా కుటుంబమేనని డ్రామారావు మాట్లాడుతున్నది ఇప్పుడు రాబోయే ఓట్లకోసమేనన్నారు. ప్రజలంతా మీ కుటుంబమేఅయితే ప్రగతిభవనలోకి ప్రతిపక్షాలను, ప్రగతిభవన్ ముందున్న రోడ్డుమీదికి ప్రజలనెందుకు రానివ్వడంలేదని ప్రశ్నించారు. నిన్నగాక మొక్క చిన్నపిల్లాడిని కుక్కలు పీక్కతింటే కనీసం వారి కుటుంబాన్ని పలకరించి ధైర్యం చెప్పిన నాథుడు లేడని, లంబాడా బిడ్డ అయిన డాక్టర్ ప్రీతిని వేధింపులతో పొట్టనపెట్టుకుంటే ఐదురోజుల నుంచి హెచ్‌ఓడీ, ప్రిన్సిపల్‌లపై వేటు వేయకుండా తప్పుచేసిన వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నావని మండిపడ్డారు. అదే నీ ఇంట్లో బిడ్డను చంపితే ఊరుకుంటావా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
వలంటీర్ వ్యవస్థపై ఏపీ హైకోర్టు సీరియస్.. అంత నమ్మకం లేదా అంటూ జగన్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం
మేము జగన్‌పై ఉద్యమానికి వెళ్తున్నాం
జగన్‌తో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా?: సోమిరెడ్డి
ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డికి ఉద్యమ కార్యాచరణ నోటీసు ఇచ్చిన జేఏసీ నేతలు