Breaking News: బండి సంజయ్ అరెస్ట్
ABN , First Publish Date - 2023-01-06T20:46:56+05:30 IST
కామారెడ్డి కలెక్టరేట్ (Kamareddy Collectorate) దగ్గర తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కామారెడ్డి కలెక్టరేట్ (Kamareddy Collectorate) దగ్గర తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంజయ్‌ని తరలిస్తున్న వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. బీజేపీ (BJP) కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ బండి సంజయ్ నిరసనకు దిగారు. కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు.
అంతకు ముందు కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులకు మద్దతుగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడించారు. బారి గేట్లు సైతం లెక్కచేయకుండా మహిళలు రైతులు, బీజేపీ నాయకులు తోసుకుంటూ వచ్చారు. కలెక్టర్ ను కలిసేంతవరకు వెళ్లెది లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అక్కడే కూర్చున్నారు.
కామారెడ్డి మునిసిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వెంటనే రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కామారెడ్డి, అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామాల ప్రజలు, రైతులు చేస్తున్న ఆందోళనలను విరమింపజేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. నెల రోజులుగా ప్రజలు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్లూరు ఎల్లారెడ్డిలో రైతు పయ్యావుల రాములు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని, రాములు కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మాస్టర్ ప్లాన్‌లో రైతుల పొలాలను పారిశ్రామికవాడల కింద గుర్తించడం వల్ల కొద్దిగా భూములున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా రైతుల ఉద్యమం నడుస్తున్నా స్పందించకపోవడం రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిన్న చూపునకు నిదర్శనమన్నారు.