Home » Bandi Sanjay Kumar
BJP: తెలంగాణలో వరుస గెలుపుల కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్ రచిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చిన జోష్తో స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేలా హై కమాండ్ కసరత్తు ప్రారంభించింది.
Bandi Sanjay: రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శలు చేశారు. పేపర్లో ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని.. వారి సంక్షేమానికి కృషి చేయాలని బండి సంజయ్ కుమార్ కోరారు.
Bandi Sanjay Kumar:రంజాన్ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4 గంటల తర్వాత విధుల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ గుర్తుచేశారు. పాఠశాలల వేళలు సైతం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తాయని తెలిపారు.
CM Revanth Reddy: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్లక్ష్యం వల్ల ఓలింపిక్లో ఒక్క స్వర్ణం కూడా దక్కలేదని సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి నిజంగా ఎస్సీలపై చిత్తశుద్ధి ఉంటే ఎందుకు పార్లమెంట్లో చట్టం చేయడం లేదని ప్రశ్నించారు.
Bandi Sanjay: అవినీతి కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నిలదీశారు. ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్తో డీల్ చేసుకున్నందుకు చేష్టలుడిగిపోయారా? అని ప్రశ్నించారు. బీజేపీని అణిచివేయడానికి కాంగ్రెస్తో లోపాయికారీ ఒప్పందం చేసుకుంటారా? అని నిలదీశారు.
Bandi Sanjay Kumar: రేవంత్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని బండి సంజయ్ కోరారు.
CM Revanth Reddy: బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కులగణనలో ఇప్పటి వరకు వారి వివరాలు ఎందుకు నమోదు చేసుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. 50శాతం ఉన్న ప్రజలు, అర శాతం ఉన్న వాళ్లను ప్రశ్నిస్తారని వాళ్లకు భయపట్టుకుందని విమర్శించారు.
Bandi Sanjay: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సీఎం రేవంత్రెడ్డి తన స్థాయిని మరచి పోయి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. మోదీపై విమర్శలు చేస్తే చూస్తు ఊరుకోమని బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.
Bandi Sanjay:స్థానిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే రేవంత్ ప్రభుత్వం ఈ ఎన్నికలు నిర్వహించడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. స్థానిక సంస్థలకు ఐదేళ్లకోసారి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తుచేశారు. మీరు ఆమోదించిన రాజ్యాంగాన్ని మీరే అవమానిస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.
Bandi Sanjay : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందు నుంచి ఊహించిందేనని అన్నారు. మేధావి వర్గం అంతా బీజేపీకి ఓటు వేశారని తెలిపారు.