Bhadrachalam: భద్రాద్రిలో చంద్రబాబు పేరిట సుదర్శన హోమం
ABN , First Publish Date - 2023-10-04T13:56:35+05:30 IST
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి(Nara Chandrababu Naidu) పేరిట సుదర్శన హోమాన్ని తెలుగుదేశం నాయకులు నిర్వహించారు. జాతక, గోచార రీత్యా చంద్రబాబు బాగుండాలని, ఆయన కుటుంబం సుభిక్షంగా ఉండాలని, మళ్లీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ హోమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సమయంలో విశ్వక్సేన పూజ, పుణ్యహావచనం, అగ్నిప్రతిష్ట, హోమం, ప్రసాద నివేదన జరిపారు. ఈ కార్యక్రమం ఏపీ రాష్ట్ర తెలుగుయువత ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు ఆధ్వర్యంలో నిర్వహించారు.
బాబు విడుదల కోసం పూజలు
అక్రమ కేసులో అరెస్టు చేసి జైలులో ఉంచిన చంద్ర బాబు నాయుడును వెంటనే బేషరతుగా విడుదల చేయాలని మంగళవారం వైరాలో టీడీపీ నాయకులు పూజలు నిర్వహిం చారు. వైరా రిజర్వాయర్ అలుగుల సమీపంలో ఉన్న శ్రీదాసాంజ నేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. చంద్రబాబుపై ఆంజనేయస్వామి కరుణ చూపాలని వేడుకున్నారు. తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. టీడీపీ నాయకులు కిలారు సురేందర్, మన్నేపల్లి ప్రదీప్, మోత్కూరి వెంకటేశ్వరరావు, హరి రమేష్, బోడేపూడి మురళీ, మేదరమెట్ల పూర్ణచంద్రరావు, గింజుపల్లి జనార్థన్, చావా కాంతారావు, కోటాదాసు, చిట్యాల పుల్లయ్య, పర్సా రామకృష్ణ, రాయల జనార్థన్, సైదులు పూజలు చేశారు.
పాలడుగులో సంఘీభావ ర్యాలీ
వైరా మండలంలోని పాలడుగు గ్రామంలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ సంఘీభావ ప్రదర్శన చేశారు. అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ శీలం ధర్మారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాలడుగు సర్పంచ్ శీలం రమాదేవి, టీడీపీ వైరా పట్టణ అధ్యక్షుడు కిలారు సురేందర్, నాయకులు వనమా శ్రీనివాసరావు, హరిబాబు, నంబూరు శివ, బొల్లం శ్రీను, మోదుగు రాజు, పుల్లయ్య, షేక్.రఫీ, వెంకటేశ్వర్లు, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు కోట నాగకోటేశ్వరరావు, మురళీ పాల్గొన్నారు.