Bhadradri Kothagudem: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. అధికారపార్టీపై మాకు నమ్మకం లేదు..
ABN , First Publish Date - 2023-10-14T12:22:42+05:30 IST
బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వంలో దళిత కుటుంబాలకు న్యాయం చేస్తామని స్థానిక నాయకులు హామీలు ఇచ్చి చివరికి మర్చిపోయి మమ్ములను
- మర్కోడు ఎస్సీ కాలనీ వాసుల స్పష్టీకరణ
ఆళ్లపల్లి(భద్రాద్రి కొత్తగూడెం): బీఆర్‌ఎస్(BRS) ప్రభుత్వంలో దళిత కుటుంబాలకు న్యాయం చేస్తామని స్థానిక నాయకులు హామీలు ఇచ్చి చివరికి మర్చిపోయి మమ్ములను రోడ్డున పడేశారని ఆళ్లపల్లి(Allapally) మండలంలోని మర్కోడు ఎస్సీ కాలనీకి చెందిన సూమారు 50 దళిత కుటుంబాలు బీఆర్‌ఎస్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తు ఆరోపనలు చేశారు. శుక్రవారం మర్కోడు(Markodu) గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌పై కాని, ఆయా నాయకులపై మాకు నమ్మకంలేదని, పార్టీ కార్యక్రమాల్లో జెండాలు మోయించుకుని ఊరూరా తిప్పారు, చివరకు దళితబంధు ఇస్తామని నమ్మించి, కమీషన్లు ఇచ్చినవారికే దళిత బంధు అంకితం చేశారని, బీఆర్‌ఎస్ పార్టీలో తిరిగినా పథకాలు వచ్చె పరిస్ధితి లేదని, సొంత పార్టీలో గౌరవం, పథకాలు దక్కప్పుడు పార్టీలో ఉండి ఉపయోగంలేదన్నారు. డబుల్ బెడ్‌రూం ఇవ్వలేదు, దళితులకు మూడేకరాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఉన్న భూములు లాక్కున్నారని, కనీసం భూములు కోల్పోయిన వారికైనా న్యాయం చేయలేదని ఆరోపనలు చేశారు. వర్షకాలంలో ఇండ్లలోని నీరు వస్తే పట్టించుకున్న నాయకులు లేరని, బీఆర్‌ఎస్ పార్టీలో మాకు న్యాయం జరగలేదు, కొద్దోగొప్ప కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి సమన్యాయం చేసిందని, అందుకే బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రంగా చేరబోతున్నామని తెలిపారు.