Bhatti Vikramarka : ఆ కేసీఆర్ ఇప్పుడెక్కడ?
ABN , First Publish Date - 2023-04-18T11:32:21+05:30 IST
గుడిని, గుడిలో లింగాన్ని సీఎం కేసీఆర్ మింగుతున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
పెద్దపల్లి : గుడిని, గుడిలో లింగాన్ని సీఎం కేసీఆర్ మింగుతున్నాడని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి బ్లాకులను ప్రైవేటు పరం చేస్తే ఊరుకోబోమన్నారు. సింగరేణిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. రామగుండం ఎరువుల కర్మాగారం బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఓపెన్ కాస్ట్లను కుర్చీ వేసుకుని కూర్చొని మరీ పూడ్పించేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని భట్టి ప్రశ్నించారు. రామగుండం బొందల గడ్డ అవుతుంటే కేసీఆర్‌కు కనబడటం లేదా? అని ప్రశ్నించారు. ఆంధ్ర నేతల కంటే కేసీఆరే ఎక్కువ దోచుకుంటున్నారని భట్టి విమర్శించారు.