Bhattivikramarka: ప్రజలను ఇంకెంత కాలం మోసం చేస్తారు?
ABN , First Publish Date - 2023-10-13T12:07:26+05:30 IST
ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారని, కేసీఆర్‌కంటే పెద్ద మోసగాడు ఎవరూ లేరని, రైతులకు రుణమాఫీ నిధులు పడకపోయినా పడినట్టు సెల్‌ఫోన్‌కు
- బీఆర్‌ఎస్‌పై సీఎల్పీ నేత భట్టివిక్రమార్క మండిపాటు
మధిర(ఖమ్మం): ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారని, కేసీఆర్‌కంటే పెద్ద మోసగాడు ఎవరూ లేరని, రైతులకు రుణమాఫీ నిధులు పడకపోయినా పడినట్టు సెల్‌ఫోన్‌కు బూటకపు మెసేజ్‌లు పంపతున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క(CLP leader Mallu Bhatti Vikramarka) మండిపడ్డారు. గురువారం మధిరలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేసిన వారు.. పులి వస్తది అని ప్రగల్బాలు పలుకుతున్నారని, ప్రజలను ఆ పులి బారి నుంచి రక్షించేందుకు దాన్ని బంధించి బోన్‌లో వేస్తామన్నారు. ప్రజలకు చెందాల్సిన సంపదను లూఠీ చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మరోసారి అబద్ధపు మాటలతో ప్రజల మోసం చేసేందుకు ముందుకు వస్తున్నారని వీరి మాటలు నమ్మి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రుణమాఫీ అయినట్టు మెసేజ్‌లు వచ్చి నెల రోజులు దాటినా ఇంతవరకు ఖాతాల్లో డబ్బులు జమకాలేదన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేసి తీరతామని కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి అందించే గ్యారెంటీ కార్డులు ఈ 50రోజులు భద్రంగా ఉంచుకోవాలని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదని గ్యారంటీ కార్డులు తీసుకొచ్చి చూపించిన వారందరికీ వెంటనే అమలు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కొని ప్రభుత్వం అమ్ముకోవటం కన్నా దరిద్రం లేదని, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ పార్టీలతో రాష్ట్ర స్థాయిలో, షర్మిలతో డీల్లీ స్థాయిలో పొత్తులపై చర్చలు జరుగుతున్నాయన్నారు.