Etala: భూములపై కేసీఆర్‌ కన్నేశారు.. ప్రశ్నించినా.. అడుకున్నా సహించరంటూ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-07-25T16:39:57+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender) విమర్శలు గుప్పించారు

Etala:  భూములపై కేసీఆర్‌ కన్నేశారు.. ప్రశ్నించినా.. అడుకున్నా సహించరంటూ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై (KCR) బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (BJP MLA Etala Rajender) విమర్శలు గుప్పించారు.

"ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు తప్ప.. నిజాలు చెప్పటం లేదు. కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన గెస్ట్ లెక్చరర్స్ హామీ నెరవేరలేదు. హైకోర్టు తీర్పును కూడా ముఖ్యమంత్రి అపహస్యం చేశారు. సెలవులు వస్తే గెస్ట్ లెక్చరర్స్‌కు జీతాలు రావటం లేదు. గెస్ట్ లెక్చరర్స్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను. అరెస్ట్ చేసిన గెస్ట్ లెక్చరర్స్‌ను తక్షణమే విడుదల చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు 12 నెలల జీతాలు ఇవ్వాలి. కేసీఆర్‌ను ప్రశ్నించినా.. అడుకున్నా సహించరు. దేశ ప్రధాని కార్మికుల కాళ్లు కడుగుతుంటే.. కేసీఆర్ కార్మికులను ఉద్యోగాల నుంచి తీసివేశారు. ఆర్టీసీ సమ్మె చేస్తే అశ్వద్దామరెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని ఆదేశించారు. కేసీఆర్ భూములపై కన్నేశారు." అని ఈటల సంచలన ఆరోపణలు చేశారు.


"వీఆర్ఏ‌లు సమ్మె చేస్తే ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు వీఆర్ఏ సమస్యను నిర్వీర్యం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రోహిబిషన్ పీరియడ్ మూడేళ్లు పెట్టిన కేసీఆర్ మరో సంవత్సరం పెంచి నాలుగేళ్లు చేయడం దుర్మార్గం. ఇప్పటికీ జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్య పరిష్కారం కాలేదు. తెలంగాణ ప్రజలు ప్రేమకు లోంగుతారు తప్పితే దబాయింపులకు లొంగరు. ఉద్యోగులను పెట్టిన హింసకు ప్రతీకారం తీర్చుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తే వచ్చే పంట కన్నా కరెంట్ బిల్లు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. కౌలు రైతుల సమస్యలపై కేసీఆర్ సమాధానం చెప్పాలి. రైతు బంధు పేరుతో అన్ని సబ్సిడీలను ఎత్తి వేశారు.పందిరి వ్యవసాయం, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఎక్కడైనా పంట పండుతుందా కేసీఆర్ చెప్పాలి." అని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-07-25T16:42:08+05:30 IST