karnataka election results: బీజేపీ ఓటు బ్యాంకు ఎక్కడా చెక్కుచెదరలేదు: బండి సంజయ్
ABN , First Publish Date - 2023-05-13T18:06:22+05:30 IST
బీజేపీ (BJP) ఓటు బ్యాంకు ఎక్కడా చెక్కుచెదరలేదని ఆ పార్టీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) స్పష్టం చేశారు.
హైదరాబాద్: బీజేపీ (BJP) ఓటు బ్యాంకు ఎక్కడా చెక్కుచెదరలేదని ఆ పార్టీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) స్పష్టం చేశారు. ఒక్క రాష్ట్రంలో గెలవగానే ఇంతగా రెచ్చిపోతున్నారని విమర్శించారు. జేడీఎస్ 7 శాతం ఓటింగ్ కాంగ్రెస్ (Congress)కు పోయిందని తెలిపారు. 4% రిజర్వేషన్లు అమలు చేస్తామని మతరాజకీయాలు చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. ఒక వర్గం ఓట్లతోనే కాంగ్రెస్ గెలుస్తోందన్నారు. కర్ణాటక కాంగ్రెస్‌కు కూడా సీఎం కేసీఆర్ (CM KCR) డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. కన్నడిగులు కాంగ్రెస్‌కు ఘన విజయాన్ని కట్టబెట్టారు. ‘40 శాతం కమిషన్’ ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ ప్రభుత్వాన్ని గట్టి దెబ్బ తీశారు. బీజేపీ మంత్రుల్లో చాలా మంది పరాజితుల జాబితాలో చేరిపోయారు. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివ కుమార్ అద్భుత విజయాలు నమోదు చేసుకున్నారు. ప్రేమ గెలిచిందని రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. 224 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 65, కాంగ్రెస్ 136, జేడీఎస్ 19, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే చిత్తపూర్ నియోజకవర్గంలో విజయం సాధించారు. తాము కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వాన్ని ఇస్తామని ప్రియాంక్ చెప్పారు.