Share News

BRS leaders: నాడు కాళ్లుమొక్కి దేవుడన్నావ్‌.. నేడు వ్యక్తిగత దూషణలా..?

ABN , First Publish Date - 2023-11-26T11:00:11+05:30 IST

‘ఎంపీగా ఓడిన నిన్ను కేటీఆర్‌(KTR) దగ్గరకు తీసుకుని గ్రేటర్‌ అధ్యక్ష పదవి ఇచ్చారు.. ఎమ్మెల్సీ కట్టబెట్టారు.. రాజకీయ భిక్ష పెట్టిన దేవుడంటూ

BRS leaders: నాడు కాళ్లుమొక్కి దేవుడన్నావ్‌.. నేడు వ్యక్తిగత దూషణలా..?

- మైనంపల్లిపై బీఆర్‌ఎస్‌ నేతల ధ్వజం

మల్కాజిగిరి(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ‘ఎంపీగా ఓడిన నిన్ను కేటీఆర్‌(KTR) దగ్గరకు తీసుకుని గ్రేటర్‌ అధ్యక్ష పదవి ఇచ్చారు.. ఎమ్మెల్సీ కట్టబెట్టారు.. రాజకీయ భిక్ష పెట్టిన దేవుడంటూ కేటీఆర్‌ కాళ్లమీద పడ్డది నీవు కాదా మైనంపల్లి..’ అంటూ బీఆర్‌ఎస్‌(BRS) నేతలు మండిపడ్డారు. తెలుగుదేశం నుంచి వచ్చిన తర్వాత రాజకీయ భిక్షపెట్టి టీఆర్‌ఎ్‌సలో చేర్చుకున్న దేవుడు కేసీఆర్‌ అన్నావు.. ఇప్పుడేమో నీకు కొడుకు రోగం పట్టుకుని కాంగ్రె్‌సలో చేరి కేసీఆర్‌, కేటీఆర్‌లపై వ్యక్తిగత దూషణలు చేయడం ఎంత వరకు సమంజసమంటూ వారు ప్రశ్నించారు. శనివారం నేరేడ్‌మెట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎంబీసీ చైర్మన్‌ నందికంటి శ్రీధర్‌, కార్పొరేటర్‌లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ కలిసి మైనంపల్లి బూతుపురాణంపై ధ్వజమెత్తారు. ప్రజా క్షేత్రంలో ఏ విధంగా మాట్లాడాలో కూడ తెలియని నీకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణకు కోట్లాది రూపాయల పెట్టుబడులతో రాష్ట్రాన్ని ఐటీలో అగ్రగామిగా నిలుపుతున్న మంత్రి కేటీఆర్‌ను ప్రపంచ దిగ్గజాలు ఓ వైపు ఎంతో మెచ్చుకుంటున్నాయని అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత నీకు ఖాన్‌బైరీ పెట్టేది రేవంత్‌రెడ్డే అని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి జితేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు మీనాఉపేందర్‌రెడ్డి, సునీత రాముయాదవ్‌, ఏకే మురుగేష్‌, మాజీ కార్పొరేటర్‌ జగదీష్‏గౌడ్‌, జేఏసీ చైర్మన్‌ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-26T11:00:13+05:30 IST