MLC Kavitha: బోధన్‌లో స్కూటీపై ప్రయాణించిన ఎమ్మెల్సీ కవిత
ABN , First Publish Date - 2023-11-09T19:41:40+05:30 IST
నామినేషన్ ర్యాలీ ప్రారంభ ప్రదేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్కూటర్‌పై చేరుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్కూటర్‌పై కవిత ప్రయాణిస్తూ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్: ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు అన్ని రకాల హామీలతో విశ్వప్రయత్నాలు చేశారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈరోజు సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో రెండు చోట్లా నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని పార్టీల నేతలు నామినేషన్లుక దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ నామినేషన్ దాఖలు చేసేందుకు భారీ ర్యాలీగా వెళ్లారు. అయితే ఈ సందర్భంగా బోధన్‌లో భారీ ట్రాఫిక్ ఉండడంతో ట్రాఫిక్‌ను అధికమించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్కూటర్‌పై ర్యాలీ ప్రారంభ ప్రదేశానికి చేరుకొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్కూటర్‌పై కవిత ప్రయాణిస్తూ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేశారు. సిరిసిల్ల బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మంత్రి కేటీఆర్ నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో మంత్రి కేటీఆర్ నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా.. కన్నీళ్లు కావాలా నీళ్లు కావాలా.. స్కీములు కావాలా కాంగ్రెస్ స్కాములు కావాలా’’ అని ప్రశ్నించారు.