TS News: వడగాలులతో సతమతం
ABN , First Publish Date - 2023-06-09T21:24:50+05:30 IST
ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీనికి తోడు తీవ్రమైన వడగాలులతో ప్రజలు సతమతమవుతున్నారు. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో
ఖమ్మం: ఎండలు మండిపోతున్నాయి. భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దీనికి తోడు తీవ్రమైన వడగాలులతో ప్రజలు సతమతమవుతున్నారు. శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు 46కు పైగానే నమోదయ్యాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో 45డిగ్రీలకుపైన ఉష్ణోగ్రత నమోదవగా వాటిలో ఎనిమిది ప్రాంతాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో అత్యధికంగా 46.5 డిగ్రీలు నమోదవగా.. ముదిగొండ మండలం పమ్మి, బాణాపురంలలో 46.2, సత్తుపల్లిలో 45.8, భద్రాద్రి జిల్లా బూర్గంపాడులో 45.7, పాల్వంచ మండలం యానంబైలు 45.6, అశ్వాపురంలో 45.1, పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెనుబల్లిలో, ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో 44.9, ఖమ్మం నగరం ఖానాపురం హవేలి పోలీస్ స్టేషన్ ప్రాంతం, మధిర, పాల్వంచ మండలం సీతారాంపట్నంలో 44.8, తల్లాడ 44.6, ఎర్రుపాలెం, కొణిజర్ల పెద్ద గోపతి, పాత కొత్తగూడెం, కల్లూరు, ముదిగొండ, మధిర మండలం సిరిపురంలో 44.5, భద్రాచలం 44.3, అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం 44.3, ఏన్కూరు మండలం తిమ్మరావుపేట, చింతకాని, లక్ష్మీదేవిపల్లి, కొణిజర్లలలో 44.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.