Cancelled Trains: మూడు రోజుల పాటు పలు రైళ్ల రద్దు.. ట్రైన్ నంబర్లతో సహా పూర్తి వివరాలు..

ABN , First Publish Date - 2023-06-08T11:42:24+05:30 IST

ఒడిశాలో రైలు ప్రమాదం దృష్ట్యా బుధవారం నుంచి శుక్రవారం వరకు పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Cancelled Trains: మూడు రోజుల పాటు పలు రైళ్ల రద్దు.. ట్రైన్ నంబర్లతో సహా పూర్తి వివరాలు..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ఒడిశాలో రైలు ప్రమాదం దృష్ట్యా బుధవారం నుంచి శుక్రవారం వరకు పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. బుధవారం కాచిగూడ-షాలిమార్‌, వాస్కోడగామా (స్లిప్‌ కోచెస్‌-17603-18047) రైలు, షాలిమార్‌-హైదరాబాద్‌ (18045) రైలు, హైదరాబాద్‌-షాలిమార్‌ (18046) రైలు, హౌరా-శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం (22831) రైలు, భాగల్‌పూర్‌-ఎస్ఎంవీటీ బెంగళూరు రైలు (12254), హౌరా-ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ (12839) రైలు, తంబరం-సంత్రగచి (22842) రైలు, కన్యాకుమారి-దిబ్రుగడ్‌ (22503), భాగల్‌పూర్‌- ఎస్‌ఎంవీటి బెంగుళూరు (12254) రైలు, గురువారం ఎస్‌ఎంవీటి బెంగళూరు-హౌరా (12864-22888) రైళ్లు, శుక్రవారం శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం-హౌరా (22832) రైలు, వాస్కోడగామ-షాలిమార్‌ (18048) రైలు, వాస్కోడగామా-షాలిమార్‌, కాచిగూడ (18048-17604- స్లిప్‌ కోచెస్‌) రైలు, ఎస్‌ఎంవీటీ బెంగళూరు-అగర్తల (12503) రైళ్లను రద్దు చేసినట్టు పేర్కొన్నారు.

13 వరకు మరికొన్ని రైళ్ల రద్దు

జూన్‌ 7 నుంచి 13 వరకు కాచిగూడ-నిజామాబాద్‌ (07596) రైలు, నిజామాబాద్‌-కాచిగూడ (07593) రైలు, నాందేడ్‌-నిజామాబాద్‌ (07854) రైలు, నిజామాబాద్‌- నాందేడ్‌ (07853) రైళ్లను రద్దుచేసినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. జూన్‌ 7 నుంచి 13 వరకు దౌండ్‌-నిజామాబాద్‌ (11409) రైలును ముద్కేడ్‌-నిజామాబాద్‌ మధ్య పాక్షికంగా, జూన్‌ 8 నుంచి 14 వరకు నిజామాబాద్‌- పంధర్‌పూర్‌ రైలు (01413) నిజామాబాద్‌-ముద్కేడ్‌ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టు పేర్కొన్నారు.

వేసవి ప్రత్యేక రైళ్ల పొడిగింపు

కాచిగూడ-తిరుపతి ప్రత్యేక రైలు (07061)ను జూన్‌ 8న, తిరుపతి-కాచిగూడ ప్రత్యేక రైలు (07062) జూన్‌ 9న, కాచిగూడ-కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు (07417) జూన్‌ 10న, కాకినాడ టౌన్‌... కాచిగూడ ప్రత్యేక రైలు (07418)ను జూన్‌ 11న నడుపుతున్నట్టు తెలిపారు. జూన్‌ 8 నుంచి 29 వరకు (గురువారం) కాచిగూడ-నర్సాపూర్‌ రైలు (07653) నాలుగు ట్రిప్పులు, జూన్‌ 9 నుంచి 30 వరకు (శుక్రవారం) నర్సాపూర్‌-కాచిగూడ ప్రత్యేక రైలు (07654) నాలుగు ట్రిప్పులు నడపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

Updated Date - 2023-06-08T11:42:27+05:30 IST