CBN Arrest: ఏపీలో రౌడీల పాలన రాజ్యమేలుతోంది...

ABN , First Publish Date - 2023-10-10T12:57:18+05:30 IST

‘‘మాజీ సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసిన ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన చేస్తుందని... దీనిపై తక్షణ న్యాయ విచారణ

CBN Arrest: ఏపీలో రౌడీల పాలన రాజ్యమేలుతోంది...

- చంద్రబాబు అరెస్ట్‌ అక్రమం

- రోడ్డుపై వంటా వార్పు చేసి టీడీపీ నేతల నిరసన

ఖమ్మం: ‘‘మాజీ సీఎం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసిన ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన చేస్తుందని... దీనిపై తక్షణ న్యాయ విచారణ చేసి చట్టాన్ని రక్షించాలని ’’ టీడీపీ నాయకులు కేతినేని హరీష్‌, మల్లెంపాటి అప్పారావు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ సోమవారం టీడీపీ కార్యాలయం ఎదుట రోడ్డుపై వంటా వార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో రౌడీల పాలన రాజ్యం ఏలుతోందని వారి పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రతిభను ఇనుమడింప చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్‌ చేయడం అనైతికమని ఘోషిస్తున్నా రోజుకో కేసు బనాయించి అక్కడి ప్రభుత్వం చంద్రబాబును ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇలాంటి పాలనను ఎక్కడా చూడలేదని వైసీపీ ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలను విధించాలని వారు డిమాండ్‌ చేశారు. లేకుంటే ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా జగన్‌ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు వచ్చాయని అన్నారు. అనంతరం రోడ్డుపై బైటాయించి ఆందోళన నిర్వహించారు. జగన్‌కు వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. వూ వాంట్‌ జస్టిస్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో కొండబాల కరుణాకర్‌, కోటి, చుండూరి రాజేశ్వరి, మందపల్లి రజని, కామ అనిత, చేతుల నాగేశ్వరరావు, నాగార్జునపు శ్రీణు, మంద వెంకటనారాయణ, మీగడ రామారావు, రాణి, అశోక్‌, చిరుమామిళ్ల రవి, పద్మనాభం, మురళి, నల్లమల రంజిత్‌, దామ శ్రీను, ఆర్యప్రసాద్‌, నల్లమల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

nara1,2.jpg

Updated Date - 2023-10-10T12:57:18+05:30 IST