Congress Vs BRS: కొండా సురేఖ, పల్లా రాజేశ్వర్ మధ్య వాగ్వాదం
ABN , Publish Date - Dec 30 , 2023 | 06:21 PM
మంత్రి కొండ సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. దీంతో రాజేశ్వర్ రెడ్డి సమీక్ష సమావేశం నుంచి ఉన్నట్టుండి వెళ్లిపోయారు.
సిద్దిపేట జిల్లా: సిద్దిపేట హరిత హోటల్లో మంత్రి కొండ సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. దీంతో రాజేశ్వర్ రెడ్డి సమీక్ష సమావేశం నుంచి ఉన్నట్టుండి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నాయకులను స్టేజి మీదకు పిలిచే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సమీక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నాట్లు చెప్పారు. సంప్రదాయాలకు , ఆచారాలకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారనన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిన వారిని కూడా స్టేజీ మీదికి పిలవడం చాలా దురదృష్టకరమని చెప్పారు. మల్లికార్జున స్వామిని దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ సమావేశాన్ని హోటల్లో పెట్టలేదన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కూడా వెళ్లిపొమ్మనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. తమ హయాంలో ఇలా ఎప్పుడూ రాజకీయాలను ఉపయోగించుకోలేదని ఆయన పేర్కొన్నారు.