Share News

BRS CM Kcr: కేసీఆర్ సడెన్ ట్విస్ట్!.. బీఆర్‌ఎస్ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు... !

ABN , First Publish Date - 2023-10-15T13:09:32+05:30 IST

తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (CM KCR) ముందు ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరిని మార్చే ఉద్దేశ్యం ఉందా?. ముందు ప్రకటించిన 115 మందిలో ఒకరు పార్టీ మారగా మిగతా 114 మందిలో అందరికీ బీ-ఫామ్స్ ఇవ్వరా?.. అనే సందేహాలకు తావిచ్చేలా సీఎం కేసీఆర్ వ్యవహరించారని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

BRS CM Kcr: కేసీఆర్ సడెన్ ట్విస్ట్!.. బీఆర్‌ఎస్ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు... !

హైదరాబాద్: తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (CM KCR) ముందు ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరిని మార్చే ఉద్దేశ్యం ఉందా?. ముందు ప్రకటించిన 115 మందిలో ఒకరు పార్టీ మారగా మిగతా 114 మందిలో అందరికీ బీ-ఫామ్స్ ఇవ్వరా?.. అనే సందేహాలకు తావిచ్చేలా సీఎం కేసీఆర్ వ్యవహరించారని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేవలం 51 బీఫామ్స్ మాత్రమే సిద్ధంగా ఉన్నాయని, మిగతావి సిద్ధమవుతాయని అనడమే ఇందుకు దారితీసింది. బీఫామ్స్‌లో సిద్ధమవ్వలేదని కేసీఆర్ చెప్పడాన్ని నమ్మొచ్చా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 21న బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిందని, దాదాపు 50 రోజుల తర్వాత బీఫామ్స్ సిద్ధంగాలేవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ, ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్న పార్టీ ఇంకా బీఫామ్స్ రెడీ అవ్వలేదనడం ఆ పార్టీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అంశమని అంటున్నారు.


అసంతృప్తులు బయటకు వెళ్లకుండా నియంత్రించేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలపై ప్రతికూల రిపోర్టులు కూడా ఉండడంతో వారిని మార్చేఅవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. కాగా 51 బీఫామ్స్ సిద్ధమయ్యాయని చెప్పగా అవి ఎవరెవరికీ దక్కాయనేది ఆసక్తికరంగా మారింది. కాగా బీఫామ్స్ వస్తాయని అభ్యర్థులు అందరూ సమావేశానికి వచ్చారు. కానీ బీఫామ్స్ దక్కనివారిలో తీవ్ర ఆందోళన నెలకొన్నట్టు తెలుస్తోంది.


ఈ అనుమానాలకు కొన్ని కారణాలు బలాన్ని చేకూర్చుతున్నాయి. కొందరు అభ్యర్థుల విషయంలో పార్టీలోనే అసంతృప్తులు ఉండడం, కొందరు అభ్యర్థులపై నిర్వహించిన సర్వేలో ప్రతికూల ఫలితాలు రావడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. మరోవైపు విపక్షాల అభ్యర్థులు కూడా ఇంకా ఖరారు కాని నేపథ్యంలో 51 బీఫామ్సే రెడీ అయ్యాననడం ఉత్కంఠగా మారింది. రెండు రోజుల్లోనే అందరికీ బీఫామ్స్ ఇస్తామని చెప్పినప్పటికీ ఏం జరగబోతోందనేది ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2023-10-15T13:24:17+05:30 IST