Share News

CM Revanth Reddy: బీఆర్ఎస్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ

ABN , Publish Date - Dec 16 , 2023 | 04:12 PM

CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనగా.. సీఎం ప్రసంగానికి BRS ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సముదాయించారు. ప్రగతి భవన్ ప్రజల కోసమే నిర్మించారని.. అది ఇప్పుడు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: బీఆర్ఎస్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. అనంతరం గత పదేళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఏమిరా.. ఏమిరా తెలంగాణ అంటూ కేసీఆర్‌ పోకడలను ఉద్దేశించి అందెశ్రీ రాసిన కవితతో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారని.. మేం అనే అహాన్ని తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రజలను BRS సభ్యులు నిరాశపరిచారని.. BRS పాలన కుటుంబపాలనకే పరిమితమవుతుందని నిరూపించారని ఎద్దేవా చేశారు.

కాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనగా.. సీఎం ప్రసంగానికి BRS ఎమ్మెల్యేలు అడ్డు తగిలారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సముదాయించారు. ప్రగతి భవన్ ప్రజల కోసమే నిర్మించారని.. అది ఇప్పుడు జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతిభవన్‌ గడీని తెలంగాణ ప్రజలు కోసం బద్దలుకొట్టామన్నారు. ఈటల, గద్దర్‌ను ప్రగతిభవన్‌లోకి రానివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సభలో BRS సభ్యుల తీరు సరిగా లేదని.. కాంగ్రెస్‌కు ఇంత పెద్ద అవకాశం ప్రజలు కల్పించారని రేవంత్ తెలిపారు. ఎంతో మంది సీనియర్లు ఉన్నా వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇవ్వలేదని రేవంత్ ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ప్రజల సమస్యలు వినడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మేనేజ్‌మెంట్‌ కోటా అంటూ కేటీఆర్‌పై రేవంత్‌ విమర్శలు చేశారు. అమరుల కుటుంబాలకు BRS కనీస గౌరవం ఇచ్చిందా అని.. ఉద్యమాల పార్టీ.. ధర్నా చౌక్‌ను ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. తొలి కేబినెట్‌లోనే గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించామని స్పష్టం చేశారు. కేబినెట్ నిర్ణయాలకు శాసనసభలో చట్టబద్ధత కల్పిస్తామన్నారు. అమరుల కుటుంబాలను BRS అవమానించిందని.. పార్టీ ఫిరాయించవారికి ఇచ్చిన మర్యాద అమరుల కుటుంబాలకు ఇవ్వలేదన్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 16 , 2023 | 04:21 PM