Narayana: మణిపూర్ అల్లర్లను కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ..

ABN , First Publish Date - 2023-07-25T13:40:32+05:30 IST

మయన్మార్ నుంచి ఆయుధాలతో మణిపూర్‌కు టెర్రరిస్టులు వస్తున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు.

Narayana: మణిపూర్ అల్లర్లను కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు.. కానీ..

హైదరాబాద్: మయన్మార్ నుంచి ఆయుధాలతో మణిపూర్‌కు టెర్రరిస్టులు వస్తున్నారని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్‌లో అన్ని రకాల ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సైనికుల కుటుంబాలను కూడా అత్యాచారం చేస్తున్నారన్నారు. మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మణిపూర్‌లో 54వేల ఎకరాలను అదానీకి ఇచ్చేశారని ఆరోపించారు. మణిపూర్ అల్లర్లను కంట్రోల్ చేయడం పెద్ద కష్టం కాదన్నారు. పార్లమెంట్‌లో వాస్తవ చర్చను పక్కదారి పట్టించేందుకు ఒక వీడియో విడుదల అయిందని.. పార్లమెంట్ ప్రారంభానికి ఒక రోజు ముందు వీడియో ఎవరు విడుదల చేశారని నిలదీశారు. మోడీ నాయకత్వంలోనే గుజరాత్‌లో అల్లర్లు అప్పుడు - ఇప్పుడు మళ్లీ మణిపూర్‌లో జరుగుతున్నాయన్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.

                                     

Updated Date - 2023-07-25T14:30:58+05:30 IST