Kavitha ED Enquiry Live: కవిత ఈడీ విచారణ ఎపిసోడ్‌లో ఇవాల్టికి ఇంతే..!
ABN , First Publish Date - 2023-03-16T10:15:14+05:30 IST
తెలంగాణ రాజకీయాలకు దేశ రాజధాని ఢిల్లీ మరోసారి వేదికైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత మరోసారి ఈడీ విచారణకు హాజరు కానుండటంతో..
04:00 pm: ఇవాళ ఈడీ విచారణకు హాజరుకాకపోవడంపై ఈడీకి రాసిన లేఖలో కవిత వివరణ
* మహిళలను ఆఫీస్‌కు పిలిపించి విచారించకూడదు: కవిత
* ఆడియో, వీడియో విచారణకు నేను సిద్ధం: ఎమ్మెల్సీ కవిత
* అధికారులు నా నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చు
* ఈ నెల 11న జరిగిన విచారణలో పూర్తిగా సహకరించా
* ఈడీ ప్రశ్నలకు నాకు తెలిసిన మేరకు సమాధానాలిచ్చా: కవిత
* ఈ నెల 11న రాత్రి 8 గంటల వరకు విచారించారు
* మళ్లీ విచారణకు రావాలని సమన్లు ఇచ్చారు: ఎమ్మెల్సీ కవిత
* వ్యక్తిగతంగా రావాలని సమన్లలో పేర్కొనలేదు: కవిత
* నా ప్రతినిధిగా భరత్‌ను ఈడీ వద్దకు పంపాను: ఎమ్మెల్సీ కవిత
03: 30 pm: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కీలక స్టేట్‌మెంట్
* లిక్కర్ స్కామ్ కేసులో కవిత అనుమానితురాలు
* స్పెషల్ కోర్టుకు చెప్పిన ఈడీ అధికారులు
03:15 pm: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన కవిత, కేటీఆర్, హరీష్‌రావు
* నేడు ఈడీ విచారణకు కవిత గైర్హాజరు
* ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు మళ్లీ నోటీసులిచ్చిన ఈడీ
* మార్చి 20న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో కవితకు స్పష్టం చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
03:00 pm: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సీబీఐ కోర్టుకు అరుణ్ రామచంద్ర పిళ్లై
* అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీ పొడిగించిన సీబీఐ కోర్టు
* పిళ్లైకి మూడురోజుల కస్టడీ పొడిగించిన సీబీఐ కోర్టు
02:50 pm: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం
* వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు
* మార్చి 18న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టీకరణ
* ఇప్పటికే ఇదే కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న మాగుంట కుమారుడు రాఘవరెడ్డి
* నేడు మాగుంట రాఘవరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ
02:30 pm: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు
* ఈ నెల 20న విచారణకు రావాలని కవితకు ఈడీ ఆదేశం
02:20 pm: ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తే పెద్దఎత్తున ఆందోళన చేసే యోచనలో బీఆర్ఎస్
* ఈడీ కార్యాలయం దగ్గర ఆందోళన చేసే యోచనలో బీఆర్ఎస్
02:00 pm: ఈడీ విచారణకు కవిత హాజరు కాని నేపథ్యంలో దూకుడు పెంచిన ఈడీ అధికారులు
* కోర్టులో కవిత అరెస్ట్‌కు వారంట్ తీసుకునే యోచనలో ఈడి.. కవిత
01:40 pm: కవిత అంశంలో ఈడీ ముందున్న మార్గాలపై ABNతో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ కామెంట్స్..
* ఈడీ మరో డేట్ ఇచ్చే అవకాశం
* సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందున అది ముగిసేవరకు వేచి చూసే అవకాశం
* కస్టడీలో ఉన్నవారి దగ్గరకు రమ్మని కవితకు సమన్లు జారీ చేసే అవకాశం
* కవిత తన సెల్‌ఫోన్లను నిర్వీర్యం చేశారని అంటున్నారు... ఆ ఫోన్లలో ఈడీ తమకు అవసరమైన అంశాలు ఉన్నాయని... దీనిని ప్రాధాన్యతగా భావించే అవకాశం
* అన్ని అంశాలను బేరీజు వేసుకునే కవిత అరెస్ట్‌పై నిర్ణయం
01:15 pm: ‘నీ బిడ్డ ఢిల్లీలో అరెస్ట్‌కి సిద్దం అవుతోంది’
* కేసీఆర్‌ను ఉద్దేశించి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
* కవిత ఈడీ విచారణకు హాజరు కాకపోవడంతో బండి వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
01:00 pm: ఈడీ కోరిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చాం: కవిత లాయర్ సోమా భరత్‌కుమార్
* కవిత తరపున ఈడీకి డాక్యుమెంట్లు సమర్పించాం: న్యాయవాది
* ఈడీ ఎలాంటి నోటీసు, డేట్స్ ఇవ్వలేదు: కవిత లాయర్
* కవితపై కేంద్రం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టింది: లాయర్
* సీఆర్పీసీ, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలి: కవిత లాయర్
* 6 గంటల్లోనే విచారణ జరపాలన్న నిబంధన ఉంది: న్యాయవాది
* మహిళల హక్కులను కేంద్రం ఉల్లంఘిస్తోంది: కవిత లాయర్
* ఇంటి దగ్గర ప్రశ్నించాలన్న కవిత విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది
* చట్ట ప్రకారం ఇంటి దగ్గరే విచారణ జరపాలి: కవిత లాయర్
*************************************************************
12:30 pm: ఈడీ విచారణకు సాయంత్రం 3 గంటలకు కవిత హాజరయ్యే అవకాశం
* అరుణ్ పిళ్లైతో కలిసి కవితను విచారించాలనుకున్న ఈడీ అధికారులు
* పిళ్లైతో కలిసి ఈడీ విచారణలో భాగమయ్యేందుకు కవిత సుముఖంగా లేరని సమాచారం
* మధ్యాహ్నం 2 గంటలకు ముగియనున్న పిళ్లై కస్టడీ
* అందువల్ల.. సాయంత్రం 3 గంటల తర్వాత కవిత హాజరు కావొచ్చంటున్న జాతీయ మీడియా
12:00 pm: ఈడీ విచారణకు హాజరు కాలేనని లేఖ రాసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
* అనారోగ్య కారణాల దృష్ట్యా విచారణకు రాలేనని లేఖలో ఈడీకి వెల్లడించిన కవిత
* కవిత విజ్ఞప్తిని అంగీకరించని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
* హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసిన ఈడీ
* ఏం జరగనుందోనన్న ఉత్కంఠలో రాజకీయ వర్గాలు
11: 45 am: Breaking News: అనారోగ్య కారణాలతో నేటి ఈడీ విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత గైర్హాజరు
11:40 am: విచారణకు వెళ్లడానికి ఆలస్యం కావడంతో తన ప్రతినిధి ద్వారా ఈడీ అడిగిన సమాచారాన్ని పంపిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
* బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ద్వారా ఈడీకి సమాచారాన్ని చేరవేసిన కవిత
* కాసేపట్లో ఈడీ ఆఫీస్‌కు సోమా భరత్
11:30 am: న్యాయ నిపుణులతో ముగిసిన కవిత చర్చలు
* కవిత ఇంటి దగ్గర ఎస్కార్ట్ వాహనం
* ఈడీ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ
* ఈడీ ఎదుట 11 గంటలకే హాజరు కావాల్సిన కవిత
* విచారణకు వెళ్లకుండా 11 నుంచి 11.30 మధ్యలో న్యాయ నిపుణులతో కవిత ఏం చర్చించారోనన్న ఆసక్తిలో రాజకీయ వర్గాలు
11:00 am: ఢిల్లీలో లీగల్ ప్రతినిధులతో సమావేశమైన కవిత
* మరికొద్దిసేపట్లో ఇంటి నుంచి బయటకు రానున్న కవిత
10:50 am: ఈడీ కార్యాలయాన్ని ముట్టడించునున్న బీఆర్‌ఎస్
* ఈడీ ఆఫీస్ వద్ద భారీగా మోహరించిన కేంద్ర బలగాలు
10:30 am: నేటితో ముగిసిన అరుణ్ పిళ్ళై ఈడీ కస్టడీ
* మాగుంట రాఘవరెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ
10:15 am: ఢిల్లీలో కవితకు మద్దతుగా బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు,ఎమ్మెల్యేలు,భారత్ జాగృతి నేతలు
* దర్యాప్తు సంస్థల తీరుకు నిరసనగా ఢిల్లీలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేసే అవకాశం
10:00 am: లిక్కర్ కేసులో రెండోసారి ఈడీ విచారణకు కవిత
* అరుణ్ పిళ్లైతో కలిపి కవితను ప్రశ్నించనున్న ఈడీ
* కవితకు మద్దతుగా ఢిల్లీలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు
* ఢిల్లీలోని కేసీఆర్ నివాసం దగ్గర 144 సెక్షన్
* ఎటువంటి ఆందోళనలు జరగకుండా పోలీస్ బందోబస్తు
న్యూఢిల్లీ: తెలంగాణ రాజకీయాలకు (Telangana Politics) దేశ రాజధాని ఢిల్లీ (New Delhi) మరోసారి వేదికైంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam) బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత (BRS MLC Kavitha) మరోసారి ఈడీ విచారణకు హాజరు కానుండటంతో హస్తిన కేంద్రంగా రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కవితకు మద్దతుగా తెలంగాణ మంత్రులు, ఎంపీలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. కవిత సోదరుడు మంత్రి కేటీఆర్ (Minister KTR), మరో మంత్రి హరీష్ రావు (Telangana Minister Harish Rao) కూడా ఢిల్లీలో ఉండి ఎప్పటికప్పుడు పరిణామాలను గమనిస్తున్నారు.
గురువారం ఉదయం 11 గంటలకు కవితను ఈడీ విచారించనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ఈడీ (Kavitha ED Enquiry) ఎదుట హాజరు కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. మార్చి 11న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) కవితను తొలిసారి విచారించింది. దాదాపు 9 గంటల పాటు కవిత విచారణ సాగింది. ఇక.. కవితకు సంబంధించిన ఇవాల్టి ఈడీ విచారణ విషయానికొస్తే.. అరుణ్ పిళ్లైతో (Arun Pillai) కలిపి కవితను ప్రశ్నించాలని ఈడీ డిసైడ్ అయింది. నేడు బుచ్చిబాబును కూడా ఈడీ విచారణకు పిలిచింది. ఇదే లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డి (Magunta Raghava Reddy) బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. తీవ్రమైన బలవంతపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న చందన్‌రెడ్డిని క్రూరంగా కొట్టారని, దాంతో ఆయన వినికిడి శక్తి కోల్పోయారని పేర్కొన్నారు. దీనిపై చందన్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని, ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని వివరించారు. తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలా సాక్షులను ఈడీ అధికారులు బెదిరిస్తున్నారని, కుటుంబ సభ్యులను అరెస్టు చేస్తామంటూ భయపెడుతున్నారని తెలిపారు.
కేంద్రంలోని అధికార పార్టీ ఇష్టం ప్రకారం ఈడీ తనకు వ్యతిరేకంగా దర్యాప్తు చేస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తనపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలు జారీ చేయాలని, తనకు ఈడీ జారీ చేసిన నోటీసులపై స్టే విధించడమే కాకుండా వాటిని రద్దు చేయాలని సుప్రీంకోర్టును కవిత అభ్యర్థించారు. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం నాడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలొని ధర్మాసనం ఎదుట న్యాయవాదులు ప్రస్తావించారు. అయితే తక్షణమే స్టే విధించడానికి ధర్మాసనం నిరాకరించింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ చేపడతామని తెలిపింది.