Share News

Bhatti Vikramarka: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీ సొంతం..

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:45 PM

Telangana: తెలంగాణ భవన్‌లో మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు వర్ధంతి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై నివాళులర్పించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ..పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీ సొంతమన్నారు.

Bhatti Vikramarka: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీ సొంతం..

న్యూఢిల్లీ: తెలంగాణ భవన్‌లో మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావు (Former PM PV Narasimharao) వర్ధంతి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) హాజరై నివాళులర్పించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ..పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీ సొంతమన్నారు. విద్యా వ్యవస్థ, అనేక సామాజిక మార్పులకు ఎంతో కృషి చేశారన్నారు. పీవీ నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తి తెలంగాణలో పుట్టడం అందరికి గర్వకారణమన్నారు. మొట్టమొదటి సారి గురుకుల పాఠశాలల రూపకల్పన ఘనత పీవీ కే దక్కుతుందన్నారు. భూ సంస్కరణలు అమలు చేసిన చేసిన సాహసి పీవీ నరసింహారావు అని కొనియాడారు. పీవీ నరసింహారావు లాంటి శక్తివంతమైన నాయకుడిని ప్రధానిని చేసింది కాంగ్రెస్ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Updated Date - Dec 23 , 2023 | 12:45 PM