Share News

Hyderabad: దీపావళి సంబరాల్లో అపశృతి.. భార్యను కాపాడబోయి భర్త మృతి

ABN , First Publish Date - 2023-11-12T21:16:52+05:30 IST

దీపావళి సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. మల్కాజ్‌గిరిలో టపాసులు కాలుస్తుండగ దంపతులు మంటల్లో చిక్కుకున్నారు. భార్య చీరకు నిప్పంటుకోవడంతో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన భర్త ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. భార్యకు తీవ్రయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

Hyderabad: దీపావళి సంబరాల్లో అపశృతి.. భార్యను కాపాడబోయి భర్త మృతి

హైదరాబాద్: దీపావళి సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. మల్కాజ్‌గిరిలో టపాసులు కాలుస్తుండగ దంపతులు మంటల్లో చిక్కుకున్నారు. భార్య చీరకు నిప్పంటుకోవడంతో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన భర్త ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకొని మృతి చెందారు. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

మల్కాజ్‌గిరి ప్రేమ్ విజయనగర్ కాలనీ వెంకటేశ్వర అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న రాఘవరావు (82) అతని సతీమణి రాఘవమ్మ (79) దీపాలు వెలిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు భార్య చీరకు నిప్పంటుకుంది. ప్రమాదం నుంచి భార్యను కాపాడేందుకు ప్రయత్నించిన భర్త మంటల్లో చిక్కుకుపోయి మృతి చెందారు. భార్యకు 80 శాతం గాయాలు కావడంతో చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2023-11-12T21:45:14+05:30 IST