Dogs: వరంగల్ నగరంలో కుక్కల స్వైర విహారం

ABN , First Publish Date - 2023-05-20T08:45:18+05:30 IST

వరంగల్ నగరం (Warangal city)లో కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న కుక్కలబెడదతో జనం హడలిపోతున్నారు.

Dogs: వరంగల్ నగరంలో కుక్కల స్వైర విహారం

వరంగల్: వరంగల్ నగరం (Warangal city)లో కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న కుక్కలబెడదతో జనం హడలిపోతున్నారు. బాబోయ్‌.. కుక్కలంటూ అటు వైపు వెళ్లా లంటే వాహనదారులు సైతం భయపడిపోతున్నారు. వరంగల్‌లో కుక్కల బెడద ఎక్కువగా ఉంది. ప్రధాన రహదారులు, వీధుల్లో కుక్కలు (Dogs) గుంపులు గుంపులుగా సంచరిస్తూ రోడ్డ పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడులు చేస్తున్నాయి. అలాగే ఇళ్ల ముందు ఆడుకుంటున్న పిల్లలు, రాత్రి వేళల్లో ఇళ్ల ముందు పడుకుంటున్న వారిపై దాడి చేసి కరుస్తున్నాయి. అలాగే ద్విచక్రవాహనదారులను వెంబడిస్తున్నాయి. అయినా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. బయటకు రావాలంటేనే నగరవాసులు భయపడుతున్నారు.

కుక్కల దాడిలో 8ఏళ్ల బాలుడి మృతి

శుక్రవారం కాజీపేటలో ఎనిమిదేళ్ల బాలుడిపై మూడు వీధి కుక్కలు దాడి చేశాయి. బహిర్భుమికి వెళ్లిన ఆ చిన్నారిని చెత్త కుప్పల్లో ఉన్న కుక్కలు చుట్టుముట్టి చెవి భాగం, మెడ, కాళ్లు, చేతులను కరిచాయి. శరీరమంతా రక్తసిక్తమై... అక్కడికక్కడే ప్రాణాలొదిలాడా బాలుడు. హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే క్వార్టర్స్‌ సమీపంలో జరిగింది. బాధిత కుటుంబసభ్యులు సంచార జీవులు. రైల్లో వివిధ ప్రాంతాలు తిరుగుతూ పిల్లల ఆట బొమ్మలు, బెలూన్లు అమ్ముకొని పొట్టపోసుకునే నిరుపేదలు. ముందురోజు రాత్రే కాజీపేట స్టేషన్‌లో దిగారు. మరుసటి రోజు ఉదయమే ఈ ఘటన జరిగింది. అప్పటివరకు కళ్లముందు ఆడుకున్న కుమారుడిని విగతజీవిగా చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.

Updated Date - 2023-05-20T08:45:18+05:30 IST