Double bedroom houses: పేదల ఇళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం..? పశువులకు నిలయంగా డబుల్ బెడ్రూం ఇళ్లు..

ABN , First Publish Date - 2023-07-21T16:33:32+05:30 IST

కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు (Double bedroom houses) నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.

Double bedroom houses: పేదల ఇళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం..? పశువులకు నిలయంగా డబుల్ బెడ్రూం ఇళ్లు..

గజ్వేల్, సిద్దిపేట జిల్లా: కేసీఆర్ ప్రభుత్వం (KCR Govt) అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల (Double bedroom houses) నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ఇప్పుడా ఇళ్లు బర్రెలకు, గొర్లకు అవాసాలుగా మారాయి. ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి నాలుగైదేల్లు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడం ప్రభుత్వ అధికారుల అలసత్వానికి ఇదే నిదర్శనం.


అది అధికార బిఅర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం.. పేదల ఆత్మగౌరవ నివాసాలుగా ప్రచారం.. గేటెడ్ కమ్యూనిటీ హౌస్ లు కూడా వీటికి సరితూగవని, మేము తప్ప దేశంలో ఎవరైనా ఇలాంటి ఇండ్లు పేదలకు ఇస్తున్నారా అంటూ డంభాచరాలకు లెక్కే లేదు. అలాంటి పేదల ఆత్మగౌరవ నివాసాలు ఎంత చక్కగా ఉన్నాయో ఈ దృశ్యాలను చూస్తే తెలిసిపోతుంది.. అది కూడా మరెక్కడో కాదు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోనే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిరుపేద ప్రజల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లు పశువులకు నిలయంగా మారాయి. గజ్వేల్ మండలంలోని దాచరం గ్రామంలో నిరుపేద కుటుంబాల కోసం ప్రభుత్వం పదిహేడు రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. నిర్మాణ పనులు ప్రారంభించి నాలుగైదేల్లు గడుస్తున్నా నిర్మాణ పనులు పూర్తి కాలేదు. పేదల దరికి చేరలేదు. నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో ఇప్పుడా ఇళ్లు బర్రెలకు, గొర్లకు అవాసాలుగా మారాయి. పేదల ఆత్మగౌరవం మాట ఎలా ఉన్నా, సర్కారు ప్రతిష్టాత్మకమైన నివాసాలు కనీసం పశువులకైనా కాసింత నీడను, ఎండ, వాన నుంచి రక్షణన ఇస్తున్నందుకైనా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సార్ధకత చేకూరుతుందేమో.

Updated Date - 2023-07-21T16:45:19+05:30 IST