సమాజ సేవకు గుర్తింపుగా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా డా.నటరాజ్‌కు బంగారు పతకం

ABN , First Publish Date - 2023-07-17T20:46:16+05:30 IST

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం (జూలై 17, 2023) వార్షిక సమావేశం (Annual General Body Meeting) జరిగింది. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా లయన్ డాక్టర్ ఏ.నటరాజు బంగారు పతకాన్ని అందుకున్నారు.

సమాజ సేవకు గుర్తింపుగా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా డా.నటరాజ్‌కు బంగారు పతకం

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం (జూలై 17, 2023) వార్షిక సమావేశం (Annual General Body Meeting) జరిగింది. రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా లయన్ డాక్టర్ ఏ.నటరాజు బంగారు పతకాన్ని అందుకున్నారు. గత మూడు దశాబ్దాలుగా చేస్తున్న సమాజ సేవకు గుర్తింపుగా ఈ పతకాన్ని అందుకున్నారు. దేశవ్యాప్తంగా రెడ్‌క్రాస్ సొసైటీలో ఇద్దరికీ మాత్రమే ఈ బంగారు పతకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ.. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ 100 ఏళ్లకు పైగా ప్రజలకు సేవ చేస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సుక్ మాండవీయ, తమిళిసై, బందరు దత్తాత్రేయతో పాటు 9 రాష్ట్రాల గవర్నర్లు హాజరయ్యారు. వీరితోపాటు రాష్ట్ర రెడ్ క్రాస్ తరపున చైర్మన్ అజయ్ మిశ్రా, జనరల్ సెక్రటరీ మదన్ మోహన్ రావు, జాతీయ కమిటీ సభ్యులు విజయ్ చందర్ రెడ్డి హాజరయ్యారు.

32 ఏళ్లుగా నటరాజ్ సేవలు...

డాక్టర్ ఏ. నటరాజ్ నాగర్ కర్నూల్ పట్టణంలో స్వాతంత్ర్య సమర యోధుడు ఏ. చంద్ర శేఖర్, గౌరమ్మలకు 2 జులై 1956న జన్మించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1990 నుంచి రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అందిస్తున్నారు. గతంలో పాలమూరు మాజీ కలెక్టర్ అనంత రాములు ఏర్పాటు చేసిన రెడ్‌క్రాస్ కమిటీలో 3 ఏళ్లపాటు రాష్ట్ర కమిటీ సభ్యులుగా పనిచేశారు. ఆ తర్వాత 2002లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు కొత్తగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి గవర్నర్ రంగ రాజన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించి గుర్తింపు పొందారు. అంతటితో ఆగకుండా కేవలం ఐదేళ్లలో అంటే 2007లో రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పడి వేల బ్లడ్ యూనిట్స్ కలెక్షన్ చేయించడంతో, రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నింటిలో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. 2023 వరకు కూడా అదే స్థానాన్ని నిలబెట్టుకుంటున్నారని పేరుంది.

Untitled-8.jpg

2005లో నాటి కలెక్టర్ మధుసూధన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణం చేపట్టి సన్నిధి పేరుతో ఓ అనాథ శరణాలయం ఏర్పాటు చేసి నేటికీ ఎలాంటి అవాంతరాలు లేకుండా సేవలు కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాస్కులు, శానిటైజేషన్, తాగునీరు, ఆహారం, ఎనర్జీ డ్రింక్స్ సరఫరా చేయడం జరిగింది. గుర్తు తెలియని శవాలు అలాగే కరోనా సమయంలో పరమపదించిన దాదాపు 48 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా సమయం నుంచి సతీమణి కల్యాణి ఫౌండేషన్ పేరుతో ప్రతి ఏడాది బియ్యం, పప్పులు కిట్స్ 1000 మందికి అందిస్తున్నారు.

2018లో ఉమ్మడి పాలమూరు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్‌గా భాద్యతలు చేపట్టారు. మెంటల్ ఛాలెంజ్ చిన్నారులకు శాంతి వనం రెసిడెన్షియల్ పాఠశాల, 2019లో మూగ చెవిటి విద్యార్థులకు అక్షర పాఠశాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. స్వామి వివేకానంద ట్రస్ట్, రెడ్ క్రాస్ కలిసిఉమ్మడి పాలమూరులో 15 ఏళ్లుగా ప్రతి ఏడాది లక్ష నోట్ బుక్స్ పేద విద్యార్థులకు అందిస్తున్నారు. 2018 నుంచి ప్రతి ఏడాది రెడ్ క్రాస్ చైర్మన్ హోదాలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ 5 వేలు అందిస్తున్నారు. వికలాంగులకు ట్రై సైకిల్స్, కాలిబర్స్, కృత్రిమ కాళ్లు, చేతులు కూడా అవసరమైన సమయంలో అందిస్తున్నారు. 2021 నుంచి 2023 వరకు గత మూడేళ్లుగా నీట్‌లో (NEET) ర్యాంక్ సాధించిన పేద విద్యార్థులను ఎంపిక చేసి ముగ్గురికి మెడిసిన్ చదివేందుకు ఆర్థిక సహాయం పూర్తిగా అందిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా సమయంలో ఆక్సిజన్ కంటైనర్స్ అందుబాటులో ఉంచేందుకు కృషి చేశారు.

Untitled-10.jpg

గత 10 ఏళ్ల నుంచి వర్షాకాలంలో తార్పాల్స్, బ్లాంకెట్స్, హైజనిక్ కిట్స్ 50 వేల వరకు అందిస్తున్నారు. అలాగే గత 5 ఏళ్లుగా మెడికల్ కాలేజీలకు 21 డెడ్ బాడీస్, నేత్రదానం కోసం దాదాపు 140 వరకు అంటే 280 మందికి నేత్రాల సౌకర్యం కల్పించారు. ఇప్పటివరకు ఆరు మందితో ఆర్గాన్స్ డొనేషన్ చేయించడం జరిగింది. అలాగే రికార్డు స్థాయిలో 1984 నుంచి 2023 నేటి వరకు 154 సార్లు రక్తదానం, ఆరు సార్లు ప్లాస్మా, ఆరు సార్లు ప్లేట్ లెట్స్ సొంతంగా ఇచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2002 నుంచి నేటి వరకు రక్తదాన శిబిరాలు నిర్వహించి లక్షా 91 వేల బ్లడ్ యూనిట్స్ కలెక్షన్ చేయడంలో కృషి చేశారు.

Updated Date - 2023-07-17T20:46:16+05:30 IST