Vishnuvardhan Reddy: అజారుద్దీన్ జూబ్లీహిల్స్ పర్యటనపై మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం
ABN , First Publish Date - 2023-08-09T22:38:40+05:30 IST
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీం ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ (Azharuddin) పర్యటించడంతో కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది.
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీం ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ (Azharuddin) పర్యటించడంతో కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపింది. అజారుద్దీన్ జూబ్లీహిల్స్ పర్యటనపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
"పార్టీ కొరకు ప్రాణాలు ఇచ్చే మనస్తత్వం నాది. క్రికెటర్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తమకు చెప్పి రాకపోవడం తప్పు. స్కాంలో ఉన్న అజారుద్దీన్ మరోసారి నియోజకవర్గానికి వస్తే తమకే సమాచారం ఇస్తే రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తాం. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసిన తమ కుటుంబాన్ని అవమానిస్తే సహించేది లేదు. తన తండ్రి పీజేఆర్ 30 సంవత్సరాలు పార్టీ కొరకు ఎన్నో త్యాగాలు చేశారు. తాను కూడా 16 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఉంటున్నాను. తనకు కాకుండా వేరే ఒకరికి టికెట్ ఇస్తే సహించేది లేదు." అని కాంగ్రెస్ నేత విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.