మాజీ మంత్రి కె.విజయరామారావు కన్నుమూత
ABN , First Publish Date - 2023-03-13T20:23:46+05:30 IST
మాజీ మంత్రి కె.విజయరామారావు (Former Minister Vijayarama Rao) కన్నుమూశారు. కొద్దిరోజులు ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
హైదరాబాద్: మాజీ మంత్రి కె.విజయరామారావు (Former Minister Vijayarama Rao) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. అపోలో ఆస్పత్రి (Apollo Hospital)లో చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయరామారావు సీబీఐ డైరెక్టర్ (CBI Director)గా పనిచేశారు. సీబీఐ అధికారిగా రిటైర్ అయ్యాక చంద్రబాబు పిలుపుతో టీడీపీలో చేరారు. టీడీపీ చేరిన ఆయన 1999లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జనార్దన్‌రెడ్డిపై ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం చంద్రబాబు (Chandrababu) కేబినెట్‌లో రోడ్డుభవనాల శాఖామంత్రిగా పని చేశారు. 2004 ఎన్నికల్లో తిరిగి జనార్దన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2009 అసెంబ్లీ ఎన్నికలలో దానం నాగేందర్ చేతిలో ఓడిపోయాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విజయరామారావు టీడీపీకి రాజీనామా చేశారు.
విజయరామారావు వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారంలో జన్మించాడు. 1958లో కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఆయన ఐపీఎస్‌గా సెలెక్ట్ అయ్యారు. 1959లో ఐపీఎస్ శిక్షణ పొంది.. చిత్తూరు ఏఎస్పీగా పనిచేశారు. సీబీఐ డైరెక్టర్‌గా హవాలా కుంభకోణం, బాబ్రీమసీదు విధ్వంసం, ఇస్రో గూఢచార్యం కేసు, ముంబై బాంబు పేలుళ్ల కేసులో పాటు అనేక కేసులు దర్యాప్తు చేశారు. సర్వీసులో ఉండగానే ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు. పదవీవిరమణ పొందిన తర్వాత విజయరామారావు పోలీస్ మాన్యువల్ రాశారు.
సీఎం కేసీఆర్ సంతాపం
విజయరామారావు మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజాప్రతినిధిగా విజయరామారావు ప్రజలకు సేవ చేశారని కొనియాడారు. విజయరామారావుతో తనకున్నఅనుబంధాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. విజయరామారావు కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విజయరామారావు అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని కేసీఆర్ ఆదేశించారు.