Yadadri: యాదాద్రీశుడి భక్తులకు వాన కష్టాలు!

ABN , First Publish Date - 2023-06-23T14:08:48+05:30 IST

ఎండొచ్చినా.. వానొచ్చినా ఆ యాదాద్రీశుడి భక్తుల కష్టాలు తప్పట్లేదు.. యాదగిరిగుట్ట క్షేత్రంలో భక్తులకు వాన కష్టాలు మొదలయ్యాయి. నిన్నమొన్నటివరకు ఎండలతో కొండపై భక్తులు తీవ్ర ఇబ్బందులు పడగా.. ఇప్పుడు తొలకరి వానకే అవస్థలు పడాల్సి వచ్చింది. వర్షంతో కొండపైన ఆలయ తిరువీధులు, బస్‌బే తదితర ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. కొండ కింద వైకుంఠద్వారం, మొదటి ఘాట్‌రోడ్‌, తులసీకాటేజ్‌ తదితర ప్రాంతాల్లో

Yadadri: యాదాద్రీశుడి భక్తులకు వాన కష్టాలు!

తొలకరి వానకే నీట మునిగిన పార్కింగ్‌ పరిసరాలు

తడిసి ముద్దయిన తిరువీధులు, బస్‌ బే ప్రాంతాలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో వానలు

నల్లగొండ, జూన్‌ 22: ఎండొచ్చినా.. వానొచ్చినా ఆ యాదాద్రీశుడి భక్తుల కష్టాలు తప్పట్లేదు.. యాదగిరిగుట్ట క్షేత్రంలో భక్తులకు వాన కష్టాలు మొదలయ్యాయి. నిన్నమొన్నటివరకు ఎండలతో కొండపై భక్తులు తీవ్ర ఇబ్బందులు పడగా.. ఇప్పుడు తొలకరి వానకే అవస్థలు పడాల్సి వచ్చింది. వర్షంతో కొండపైన ఆలయ తిరువీధులు, బస్‌బే తదితర ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. కొండ కింద వైకుంఠద్వారం, మొదటి ఘాట్‌రోడ్‌, తులసీకాటేజ్‌ తదితర ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గండి చెరువు, ఊరకుంట చెరువు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో ఆ ప్రాంతంలో పార్కింగ్‌ నిర్వహిస్తుండటంతో అక్కడ ఉంచిన వాహనాలు చుట్టూ నీరు చేరింది. అక్కడి కార్లు కాస్త పడవలని తలపించాయి. సోషల్‌మీడియాలో ఆ దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. గతేడాదీ ఇటువంటి పరిస్థితులే ఎదురైనా అధికారులు ఇప్పటికీ ఏ చర్యలు తీసుకోలేదు.

ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు మండలాల్లో గురువారం వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పత్తి విత్తనాలు నాటిన రైతులు వర్షం కోసం ఎదురు చూస్తుండగా, రెండ్రోజులుగా కురుస్తున్న వానలతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో అత్యధికంగా 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. భూదాన్‌ పోచంపల్లి, తుంగతుర్తి మండలాల్లో వానలు గట్టిగా పడ్డాయి. మునుగోడు మండలంలోని కల్వలపల్లి కాశవారిగూడెంలో రైతు మదార్‌కు చెందిన రెండు పాడి గేదెలు పిడుగుపాటుకు మృతి చెందాయి.

Updated Date - 2023-06-23T14:08:48+05:30 IST