Hyderabad Rains: రాత్రి 12 తర్వాత హైదరాబాద్‌లో సీన్ ఇది.. మీవాళ్లు గానీ ఈ ఏరియాల్లో ఉంటున్నారా..?

ABN , First Publish Date - 2023-05-01T13:51:25+05:30 IST

హైదరాబాద్‌లో కురుస్తున్న అకాల వర్షాలకు ప్రజల ప్రాణాలు పోతున్నాయి. శనివారం ఉదయం పాల కోసం వెళ్లిన మౌనిక అనే 11 ఏళ్ల బాలిక నాలాలో కొట్టుకుపోయి మృత్యువాత పడింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా..

Hyderabad Rains: రాత్రి 12 తర్వాత హైదరాబాద్‌లో సీన్ ఇది.. మీవాళ్లు గానీ ఈ ఏరియాల్లో ఉంటున్నారా..?

ప్రాణాలు తీస్తున్న వాన!

శనివారం మౌనిక.. ఆదివారం వీరస్వామి

హడలెత్తించిన వరుణుడు

కరెంట్‌ షాక్‌తో కానిస్టేబుల్‌ మృతి

ఈదురుగాలులు, ఉరుములతో వర్షం

రోడ్లపై పొంగిపొర్లిన వరద ప్రవాహం

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో కురుస్తున్న అకాల వర్షాలకు (Hyderabad Rains) ప్రజల ప్రాణాలు పోతున్నాయి. శనివారం ఉదయం పాల కోసం వెళ్లిన మౌనిక అనే 11 ఏళ్ల బాలిక నాలాలో కొట్టుకుపోయి మృత్యువాత పడింది. ఆదివారం రాత్రి ఒక్కసారిగా విరుచుకు పడిన వర్షానికి కానిస్టేబుల్‌ సోలెం వీరస్వామి(40) చనిపోయారు.

BNAGAR CHINTHAL KUNTA (4).jpg

ఓ వైపు రోడ్లపై భారీ వర్షం.. ఈదురు గాలులతో అదుపు తప్పి పడటంతో తెగి ఉన్న కరెంట్‌ వైర్‌ తగిలి చనిపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి మిన్ను విరిగి నేలపై పడినట్లుగా వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. రాత్రి 12 గంటల తర్వాత కూడా వర్ష బీభత్సం కొనసాగింది. ఉరుములు, మెరుపులతో వరుణుడు దంచికొట్టాడు. దీంతో నగరం జలసంద్రంగా మారింది. రోడ్లపై వరద పొంగిపొర్లింది.

BNAGAR CHINTHAL KUNTA (6).jpg

పలు ప్రాంతాల్లోని రహదారులపై మోకాలి లోతు వరకు వరద ప్రవాహం కొనసాగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెల 25, 29 తేదీల్లో కురిసిన కుండపోతగా కురిసిన వర్షాల నుంచి ఇంకా తేరుకోకముందే ఆదివారం రాత్రి భారీ వర్షం హడలెత్తించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఉండగా, రాత్రి 7 తర్వాత వాతావరణం చల్లబడింది. ఈ క్రమంలో నిమిషాల వ్యవధిలోనే మబ్బులు కమ్ముకుని భీకర వర్షం కురిసింది. అరగంటకు పైగా విరామం ఇవ్వకుండా హోరెత్తించింది.

Musaram Bagh Bridge (1).jpg

రోడ్లపై పోటెత్తిన వరద..

జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, షేక్‌పేట్‌, టోలీచౌకి, ఫిల్మ్‌నగర్‌, సుచిత్ర, కూకట్‌పల్లి, మోతీనగర్‌, ఎర్రగడ్డ, సనత్‌నగర్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, యూస్‌ఫగూడ, సోమాజిగూడ, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, ట్యాంక్‌బండ్‌, నాంపల్లి, కోఠి, మోజాంజాహి మార్కెట్‌, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, అంబర్‌పేట్‌, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట, విద్యానగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, సికింద్రాబాద్‌, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించింది. ఆయా ప్రాంతాల్లోని రోడ్లపై పెద్ద ఎత్తున వరద పొంగి పొర్లడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

BNAGAR CHINTHAL KUNTA (2).jpg

కూలిన చెట్లు.. నిలిచిన కరెంట్‌..

గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలుల తీవ్రతకు రోడ్లపై చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, బంజారాహిల్స్‌, షేక్‌పేట్‌, టోలీచౌకిలోని కాలనీల్లో పలుచోట్ల చెట్లు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. కొన్ని ఇళ్లలోకి నీరు రావడంతో బయటకు పంపించేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కురవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికంగా వర్షం కురిసిన ప్రాంతాల్లో గంటకు పైగా సరఫరాను నిలిపివేశారు.

BNAGAR CHINTHAL KUNTA (1).jpg

అప్రమత్తంగా ఉండాలి: మేయర్‌

వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి సూచించారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుంచి మేయర్‌ జోనల్‌ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Updated Date - 2023-05-01T13:51:29+05:30 IST