Home » Jubilee Hills
హైదరాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు వన్‌లో ఈ పేలుడు జరిగింది. ఈ ఘటన స్థానికంగా అలజడి సృష్టించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36(Jubilee Hills Road No. 36) నాలా అక్రమణకు గురైందనే ఫిర్యాదుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో కొన్నిచోట్ల నాలా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, మరికొన్ని ప్రాంతాల్లో నాలా కుంచించుకుపోయిందని హైడ్రా(HYDRA)కు కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ఖైరతాబాద్ మండలం రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Jubilee Hills MLA Maganti Gopinath) ఆరోపించారు.
డా.బీ.ఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. 2024-25 విద్యాసంవత్సరంలో అడ్మిషన్లు పొందడానికి ఆగస్టు 31 చివరి తేదీ అని విశ్వవిద్యాలయ ఇన్చార్జి ప్రొ సుధారాణి తెలిపారు.
Telangana: ఆర్జే శేఖర్ బాషాపై కేసు నమోదు అయ్యింది. నటి లావణ్యపై దాడి చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు శేఖర్‌పై కేసు నమోదు చేశారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్లో డిబేట్ అనంతరం లావణ్యపై ఆర్జే శేఖర్ రెచ్చిపోయాడు. లావణ్యను బూతులు తిడుతూ దాడి చేశాడు. దీంతో శేఖర్ దాడి చేయడంపై బాధితురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్- లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ..
మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే దళారి మోసం చేశారంటూ బాధితుడు శశిధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెన్సార్ బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పిస్తానంటూ ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తి రూ.10లక్షలు వసూలు చేశారంటూ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం(Jubilee Hills Shree Peddamma Mother Temple)లో శాకాంబరి ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభం అయ్యాయి. శనివారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక అభిషేకం చేసి అనంతరం భక్తులకు దర్శన అవకాశం కల్పించారు.
భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు.
భాగ్యనగర వాసులకు అలర్ట్.. రేపు (గురువారం) కొన్ని చోట్ల మంచి నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి ఒక రోజంతా నీటి సరఫరా జరగదని స్పష్టం చేసింది. అందుకోసం తాగునీటిని జాగ్రత్తగా, అవసరం ఉన్నంత వరకు ఉపయోగించాలని కోరింది.