SRH vs Punjab: ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ భద్రత

ABN , First Publish Date - 2023-04-09T16:02:42+05:30 IST

ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. 1500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 340 సీసీ కెమెరాలు

SRH vs Punjab: ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ భద్రత

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. 1500 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 340 సీసీ కెమెరాలు, షీటీమ్స్, క్విక్ రియాక్షన్ బృందాలతో నిఘా పెట్టారు. బ్లాక్లో టికెట్లు అమ్మితే చర్యలు తప్పవని పోలీసులు (Police) హెచ్చరించారు. మ్యాచ్కి వచ్చే ప్రేక్షకుల కోసం మెట్రో సేవలు పొడిగించారు. రాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు వినియోగంలోకి రానున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తారు. అభిమానులకు అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోనున్నారు. రాత్రి 7.30 గంటలకు సన్‌రైజర్స్, పంజాబ్ (Sunrisers Punjab) జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఉప్పల్‌లో పంజాబ్‌తో హైదరాబాద్‌ పోరు నేడు

బ్యాటర్ల దారుణ వైఫల్యంతో ఈ ఐపీఎల్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో సూపర్‌ ఫామ్‌ (Super Pharm)లో ఉన్న పంజాబ్‌ కింగ్స్‌ను ఎదుర్కోనుంది. గత రెండు మ్యాచ్‌ల్లో పవర్‌ ప్లేలో కనీసం 50 పరుగులు చేయలేకపోవడం హైదరాబాద్‌ (Hyderabad) బ్యాటింగ్‌ డొల్లతనాన్ని చూపుతుంది. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్‌ మార్‌క్రమ్‌ కూడా సన్‌రైజర్స్‌ రాతను మార్చలేకపోయాడు. లఖ్‌నవూతో గత మ్యాచ్‌లో మార్‌క్రమ్‌ డకౌట్‌ కావడం గమనార్హం. ఇక రూ. 13.25 కోట్లతో కొనుక్కున్న హ్యారీ బ్రూక్‌ రెండు మ్యాచ్‌ల్లో (13, 3) కలిపి చేసింది 16 పరుగులే. మయాంక్‌, రాహుల్‌ త్రిపాఠిలలో నిలకడ లోపిస్తోంది.

రెండు మ్యాచ్‌ల్లో అబ్దుల్‌ సమద్‌ ఒక్కడే ధాటిగా ఆడాడు. మరోవైపు భారీ షాట్లకు ప్రసిద్ధుడైన క్లాసెన్‌కు పంజాబ్‌తో మ్యాచ్‌లోనైనా చాన్స్‌ ఇస్తారేమో చూడాలి. అఫ్ఘానిస్థాన్‌ పేసర్‌ ఫజల్లా ఫారూఖి ఆకట్టుకొనే బౌలింగ్‌ చేసినా..రెండు మ్యాచ్‌ల్లోనూ బౌలర్లు డిఫెండింగ్‌ చేయగల స్కోరు లేకపోయింది. మరోవైపు రెండు మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు అందుకున్న పంజాబ్‌ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.

Updated Date - 2023-04-09T16:02:42+05:30 IST