High Court: బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2023-03-24T17:04:45+05:30 IST

బీజేపీ (BJP) మహాధర్నాకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ (High Court) ఇచ్చింది. షరతులతో కూడిన ధర్నాకు అనుమతి ఇచ్చినట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది.

High Court: బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌: బీజేపీ (BJP) మహాధర్నాకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ (High Court) ఇచ్చింది. షరతులతో కూడిన ధర్నాకు అనుమతి ఇచ్చినట్లు తెలంగాణ హైకోర్టు తెలిపింది. నేషనల్ బీజేపీ లీడర్స్, మంత్రులు ఎవరు వస్తున్నారో ఈ రోజు రాత్రి 9 గంటల లోపు పోలీసులకు చెప్పాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 500 మందితో ధర్నా చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రెచ్చ గొట్టే వ్యాక్యాలు చెయ్యకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఎవ్వరైనా ఆలా ప్రవర్తిస్తే పోలీసులు చర్యలు తోసుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

మరోవైపు ఎన్నికల నామ సంవత్సరం కాబట్టే.. కేసీఆర్ (Telangana CM KCR) రైతన్నలపై ప్రేమ చూపిస్తున్నారన్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు (BJP MLA Raghunandan Rao) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... టీఎస్పీఎస్సీ పేపర్ లీజేజీ (TSPSC Paper Leakage)పై కేటీఆరే (KTR) బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. నీతి వాఖ్యలు చెప్పే కేటీఆర్ (Telangana Minister).. లాల్ బహదూర్ శాస్త్రిని ఎందుకు ఆదర్శంగా తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ కంప్యూటర్ లీకైనా కేటీఆర్ దే నైతిక బాధ్యత అని స్పష్టం చేశారు. తండ్రి మాదిరి .. కొడుకుకు కూడా జర్నలిస్టులను తిట్టడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. పేపర్ లీకేజీపై సంబంధం లేకుంటే విద్యాశాఖ మంత్రి మాట్లాడకుండా కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన నిలదీశారు.

రాజు తర్వాత యువరాజుగా ఫీల్ అవుతున్నాడు కాబట్టే.. కేటీఆర్‌ను రాజీనామా అడుగుతున్నామన్నారు. నిండు సభలో కౌలు లేదు.. కౌలు రైతు లేడన్న కేసీఆర్‌ (Telangana CM)కు ఎన్నికలు రాగానే కౌలు రైతులు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. అటెన్షన్ డైవర్షన్ స్కీంలో భాగమే కేసీఆర్ జిల్లాల పర్యటన అని వ్యాఖ్యలు చేశారు. నిజంగా రైతులను ప్రభుత్వం ఆదుకుంటామంటే బీజేపీ స్వాగతిస్తోందన్నారు. రాష్ట్రంలో కౌలు రైతుల‌ సంఖ్య ఎంతో వ్యవసాయశాఖ కమిషనర్ శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్లౌడ్ బరస్ట్‌పై కేసీఆర్ సిట్‌ను ఎందుకు నియమించలేదని అడిగారు. ఆరు ఎకరాలు దాటిన రైతులకు ఈ ఏడాది రైతుబంధు రాలేదని రఘునందనరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-03-24T17:11:55+05:30 IST