HMDA: ప్రభుత్వ భూముల విక్రయానికి హెచ్‌ఎండీఏ సన్నాహాలు

ABN , First Publish Date - 2023-02-19T18:49:46+05:30 IST

తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి హెచ్‌ఎండీఏ (HMDA) సన్నాహాలు చేస్తోంది. మార్చి 1 నుంచి 39 ప్లాట్ల విక్రయానికి ఈ-వేలం వేయనున్నారు.

HMDA: ప్రభుత్వ భూముల విక్రయానికి హెచ్‌ఎండీఏ సన్నాహాలు

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ భూముల విక్రయానికి హెచ్‌ఎండీఏ (HMDA) సన్నాహాలు చేస్తోంది. మార్చి 1 నుంచి 39 ప్లాట్ల విక్రయానికి ఈ-వేలం వేయనున్నారు. రంగారెడ్డి (Ranga Reddy) 10, మేడ్చల్‌ 6, సంగారెడ్డి జిల్లా (Sangareddy District)లో 23 ప్లాట్లకు వేలం వేస్తారు. ఈనెల 21, 22, 23 తేదీల్లో ప్రిబిడ్ సమావేశాలు నిర్వహిస్తారు. వేలం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎమ్‌ఎస్‌టీసీ (MSTC) నిర్వహించనుంది.

విక్రయానికి గుర్తించిన స్థలాలివే!

ఖాళీ స్థలాలను అమ్మేయాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం అలాంటి స్థలాలను గుర్తించాలంటూ ఆ బాధ్యతను హెచ్‌ఎండీఏకి అప్పగించింది. దీంతో అధికారులు హైదరాబాద్‌ జిల్లాతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న ఇలాంటి స్థలాలను కూడా గుర్తించారు. హైదరాబాద్‌ జిల్లాతో పాటు గ్రేటర్‌లోని రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములు, స్థలాలు పెద్దఎత్తున ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పలు సంస్థలకు వాటి అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో లే-అవుట్లను అభివృద్ధి చేశారు. ఇలా కేటాయింపులు చేయగా మిగిలిన భూములు చాలా ఉన్నాయి. శివారులోని ఒక్కో రెవెన్యూ గ్రామ పరిధిలో ప్రభుత్వ భూములు 300 ఎకరాల నుంచి 500ఎకరాలకు పైగా ఉన్నట్టు అంచనా.

ఆదాయం కోసం అమ్మేయాలని..

ఖాళీ స్థలాలను అమ్మేయాలన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం అలాంటి స్థలాలను గుర్తించాలంటూ ఆ బాధ్యతను హెచ్‌ఎండీఏకి అప్పగించింది. దీంతో అధికారులు హైదరాబాద్‌ జిల్లాతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి (Medchal Malkajigiri), సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉన్న ఇలాంటి స్థలాలను కూడా గుర్తించారు. అధికారుల అండతో భూకబ్జాలు పెరిగిపోతుండడం, వాటిని తిరిగి సొంతం చేసుకునేందుకు ఏళ్లకేళ్లు కోర్టులో పోరాడాల్సి వస్తుండడంతో అంతకంటే వాటిని అమ్మేయడం ద్వారా ఆదాయం పెంచుకోవడమే బెటరన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఉన్న భూములను అమ్మేసి ఆదాయం పెంచుకోవచ్చన్న ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కనపెడితే, భవిష్యత్ సంగతేంటన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.

Updated Date - 2023-02-19T18:49:47+05:30 IST