Home » Medchal–Malkajgiri
మేడ్చల్ వరకు మెట్రో రైల్(Metro Rail) కావాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి డిమాండ్ చేసింది. నగరానికి ఉత్తర భాగంలో ఉన్న మేడ్చల్ శామీర్‌పేట్ ప్రాంతాలకు మెట్రో రైలు పొడిగించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు మంగళవారం బోయిన్పల్లి(Boinpally)లోని గాంధీ ఐడియాలజీ సెంటర్ వద్ద ప్లకార్డులు, ప్లెక్సీలు పట్టుకుని నిరసన చేపట్టారు.
3 రోజుల క్రితం అదృశ్యమైన పాప శవంగా ప్రత్యక్షమైంది. కన్నబిడ్డ మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. తమ బిడ్డ ఇక తిరిగి రాదనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషాద ఘటన సూరారంలో జరిగింది.
ఇప్పటికే గ్రేటర్‌గా మారిన హైదరాబాద్‌ను మహా నగరంగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దూరంగా కొత్త నగర నిర్మాణంపై దృష్టిసారించిన సర్కారు.. విస్తరణను వేగవంతం చేసింది.
రుణమాఫీ పథకంలో భాగంగా తొలి విడతలో లక్ష రుణ మాఫీ ప్రక్రియలో నల్లగొండ నుంచి అత్యధిక మొత్తంలో రుణాలు మాఫీ అయ్యాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 33 ఎకరాల వ్యవసాయేతర భూమికి రైతుబంధు సాయం దక్కింది! ఒక సీజన్లో కాదు.. ఏకంగా ఐదేళ్లు! దీనిపై ఫిర్యాదు రావడంతో ఆ సొమ్ము రికవరీకి ఆ జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి బలవన్మరణం వెనుక గల కారణాలు బయటకు రాలేదు. అయితే ఆమెకు గైనిక్ సమస్యలు ఉన్నాయని, కడుపునొప్పి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులకు తల్లి భూలక్ష్మమ్మ వాంగ్మూలిమిచ్చారు.
హైదరాబాద్‌లోని పాస్‌పోర్టు కేంద్రాల్లో ఐదు రోజులుగా సేవలు నిలిచిపోయాయి. బేగంపేట్, అమీర్‌పేట్, టోలిచౌకిల్లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్‌ను నిలిపివేశారు. నిజానికి ఆన్లైన్లో ఈ కేంద్రాలకు సంబంధించిన స్లాట్లు ఉన్నట్లు కనిపిస్తున్నా.. బుకింగ్ జరగడం లేదు.
ఆ స్థలం ఎప్పుడో 45 ఏళ్ల క్రితమే వెంచర్‌గా మారిపోయింది. వందల మంది అక్కడ పైసలు పోసి ప్లాట్లు కొనుకున్నారు. ఒకప్పుడు ఊరికి దూరంగా ఉన్న ఆ స్థలాలు.. ఇప్పుడు రూ.కోట్లు పలుకుతున్నాయి. అయితే, అధికారులు చేసిన తప్పిదం వల్ల ఆ లేఔట్‌కు మళ్లీ పట్టా పుస్తకాలు జారీ అయ్యాయి. వాటి ఆధారంగా తెరపైకి వచ్చిన కొందరు.. ఆ లేఔట్‌లోని రూ.50 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని కబ్జా చేశారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ రియల్ వ్యాపారం జోరు తగ్గలేదు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచే అత్యధిక ఆదాయం సమకూరింది. ఈ జిల్లాల్లో డాక్యుమెంట్ల నమోదు కూడా ఎక్కువగానే ఉంటుంది.
రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అధునాతన భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కెఫెటేరియాలు, వెయిటింగ్ లాంజ్‌లు ఇతర హంగులతో కార్పొరేట్ ఆఫీసుల తరహాలో ఈ బిల్డింగ్లు కట్టాలని భావిస్తోంది.