Telangana Elections 2023: మీరు వేసిన ఓటు పడిందో.. లేదో.. ఇలా తెలుసుకోవచ్చు..!
ABN , First Publish Date - 2023-11-30T06:58:49+05:30 IST
Telangana polls: మరికొద్దిసేపటిలో తెలంగాణ పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పోలింగ్‌కు సర్వసిద్ధమైంది. సుమారు 3.26కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
Telangana polls: మరికొద్దిసేపటిలో తెలంగాణ పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పోలింగ్‌కు సర్వసిద్ధమైంది. సుమారు 3.26కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలిసారి వేటు వేయబోతున్న యువత కూడా ఈసారి భారీగానే ఉన్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అయితే, ఓటు వేసిన తర్వాత మనం వేసిన ఓటు పడిందో? లేదో? ఎలా తెలుసుకోవచ్చు అనేది చాలా మంది ఓటర్లకు వచ్చే సందేహం. మనం వేసిన ఓటు పడిందా లేదా అని తెలుసుకోవడం చాలా సింపుల్. మొదట పోలింగ్ కేంద్రానికి వెళ్లగానే మొదటి అధికారి జాబితాలో మీ పేరును పరిశీలిస్తారు. అన్ని సరిగా ఉంటే రెండో అధికారి దగ్గరకు పంపుతారు. రెండో అధికారి మీ వేలుకు ఇంక్ అంటించి, ఒక చీటీ ఇస్తారు. ఆ చీటీని మూడో అధికారి పరిశీలిస్తారు.
అనంతరం ఈవీఎం దగ్గరకు పంపుతారు. రహస్య స్థలంలో మీరు బ్యాలెట్ యూనిట్‌లో ఉండే బటన్ నొక్కాలి. ఈవీఎంలో బటన్ నొక్కగానే బీప్ అని పెద్దగా శబ్దం వస్తే ఓటు పడినట్లు. అలా బీప్ శబ్దం రాలేదంటే అధికారికి సమాచారం ఇవ్వాలి. ఇక పక్కనే ఉన్న వీవీప్యాట్ యంత్రంలో మీరు ఎవరికి ఓటు వేశారనేది కూడా 10సెకన్ల పాటు కనిపిస్తుంది. పొరపాటున ఈవీఎంలో రెండు సార్లు బటన్ నొక్కినా.. మొదట నొక్కిన గుర్తుపైనే ఓటు పడుతుంది. ఎందుకంటే ఈవీఎం మెషిన్ 'వన్ ఓట్, వన్ పర్సన్' అనే ఫార్ముల ఆధారంగా పని చేస్తుంది. సో.. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు మొదట ఏ గుర్తు పక్కన ఉన్న బటన్ నొక్కుతారో.. దానికే ఓటు పడుతుందన్నమాట.