HYD: కేఎల్ఆర్ సంచలన కామెంట్స్.. వారిని.. తరిమికొట్టడానికే వచ్చా..
ABN , First Publish Date - 2023-10-31T09:14:53+05:30 IST
పార్టీని మోసం చేసిన వారిని తరిమికొట్టడానికే తాను మహేశ్వరం నియోజకవర్గానికి వచ్చానని కాంగ్రెస్ అభ్యర్థి
- మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
ఎల్‌బీనగర్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): పార్టీని మోసం చేసిన వారిని తరిమికొట్టడానికే తాను మహేశ్వరం నియోజకవర్గానికి వచ్చానని కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(Kichchennagari Lakshmareddy) పేర్కొన్నారు. సోమవారం టీపీసీసీ ప్రతినిధి దేప భాస్కర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవకుడే నాయకుడన్న సిద్ధాంతాన్ని నమ్మినవాడినన్నారు. కాంగ్రెస్‌లో గెలిచి కాం గ్రెస్‌ను వీడిపోయినందుకు సబితారెడ్డిపై పార్టీ శ్రేణులకు కోపముంద న్నారు. పార్టీని మోసం చేసి కార్యకర్తలకు అన్యాయం చేశారన్నారు. గెలిచి నోళ్లు అమ్ముడు పోవడం మొదలు పెడితే అసలు ప్రజాస్వామ్యం నిలవ దన్నారు. ఇలాంటోళ్లను తుక్కుతుక్కుగా ఓడించాల్సిన అవసరముంద న్నారు. రేపు మళ్లీ గెలిచిన వారు అమ్ముడుపోకుండా ఉండాలంటే ఇప్పుడు అమ్ముడు పోయిన వారిని శిక్షించాలన్నారు. నాకు ఈ ప్రాంతానికి సేవ చేసే అదృష్టం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాన్నారు. ప్రజల కష్టాలను వారి ఇళ్ల వద్దకే వచ్చి తీర్చే విధంగా ప్రభుత్వాన్ని పనిచేసేటట్లు చేస్తానన్నారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమస్య ఉన్నదని ఆయన చెప్పారు.
ఫార్మాసిటీ రావడంతో ఆ ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలు ఎందుకూ పనికి రాకుండా చేశారన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ప్రజలకు డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇస్తామన్నారు కానీ నేటి వరకు ఇక్కడి వాళ్లకు ఇవ్వలేదన్నారు. మాటతప్పిన ముఖ్యమంత్రి మాకు వద్దని ప్రజలు అంటున్నారన్నారు. ప్రజలకు, దొరలకు మధ్య ఈ పోటీ అని ఆయన అన్నారు. మేమంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించేందుకు మేము ముందుంటామని వచ్చిన ప్రతి నాయకునికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పారిజాత నా చెల్లెలితో సమానం ఆమె టికెట్ కోసం ప్రయత్నించడంలో తప్పులేదు ఆమెకు నేను అడ్డుపడను అని ఆయన చెప్పారు. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకే పని చేస్తానని మాటి చ్చారన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, టీపీసీసీ ప్రతినిధి దేప భాస్కర్‌రెడ్డి, పీసీసీ మాజీ కార్యదర్శి అమరేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ జంగారెడ్డి, చిలుక ఉపేందర్‌రెడ్డి, రాము, నల్లెంకి ధన్‌రాజ్‌గౌడ్, పార్టీ సరూర్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు శివప్రసాద్, ఆర్‌కేపురం కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న గణేష్‌నేత, శంకర్‌యాదవ్, శివ పాల్గొన్నారు.