Hyderabad CP: డ్రగ్స్ వినియోగంపై సినీ పరిశ్రమకు హెచ్చరిక
ABN , First Publish Date - 2023-12-13T16:47:55+05:30 IST
Hyderabad CP: డ్రగ్స్ మాఫియాకు హైదరాబాద్ నూతన సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారితో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం ఉందని తెలుస్తోందని డ్రగ్స్ మూలాలు ఉంటే ఎవరినైనా సహించేది లేదని హెచ్చరించారు.
గతంలో హైదరాబాద్‌లో డ్రగ్స్ వినియోగంపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ మాఫియాకు హైదరాబాద్ నూతన సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారితో కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా నేరాలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగం ఉందని తెలుస్తోందని డ్రగ్స్ మూలాలు ఉంటే ఎవరినైనా సహించేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు సినీ పెద్దలతో చర్చిస్తామన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారికి హైదరాబాద్‌లో చోటు లేదన్నారు.
కాగా డ్రగ్స్ సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పార్టీల పేరుతో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పబ్స్, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్ యజమానులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. డ్రగ్స్ మహమ్మారిని కూకటి వేళ్లతో పెకిలించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని.. చట్టాన్ని గౌరవించే వారితో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని సీపీ పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.