Telangana Tenth Results: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2023-05-10T12:03:03+05:30 IST

విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదోతరగతి పరీక్ష ఫలితాలు వచ్చేశాయి.

Telangana Tenth Results: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్: విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదోతరగతి పరీక్ష ఫలితాలు (Telangana Tenth Results) వచ్చేశాయి. బుధవారం పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra Reddy) ఈ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 86.60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత పొందారు. ఈ సారి కూడా బాలికలే పైచేయిగా నిలిచారు. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లా అత్యధికంగా 99 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా.. అత్యల్పంగా 59.46 శాతం ఉత్తీర్ణతతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈసారి 2,793 స్కూళ్లలో వందశాతం ఉత్తీర్ణత సాధించగా.. 25 స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ అవ్వని పరిస్థితి. పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు http://results.bse.telangana.gov.in, http://results. bsetelangana.org అనే వెబ్‌సైట్‌లలో చూడవచ్చు.

ఉత్తీర్ణత ఇలా...

  • గురుకులాల్లో 98.25శాతం ఉత్తీర్ణత.

  • ప్రభుత్వ పాఠశాలల్లో 72.39శాతం ఉత్తీర్ణత.

  • 6163 మంది విద్యార్థులకు 10 పాయింట్స్.

  • జూన్ 14 నుండి జూన్ 22 వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు.

  • మే 26 నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు

కాగా.. ఈనెల ఏప్రిల్‌ 3 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 4,84,620 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ ఏడాది 6 పేపర్లే కావడంతో వాల్యుయేషన్‌ ప్రక్రియను అధికారులు త్వరగా పూర్తి చేశారు. గతంలో లాగా ఫలితాల్లో తప్పులు దొర్లకుండా అధికారులు ట్రయల్ రన్ నిర్వహించినట్లు సమాచారం. రెండు, మూడుసార్లు వెరిఫికేషన్‌ చేసి మరీ.. టెక్నికల్‌ ట్రయల్స్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఫైనల్ దశకు చేరుకోవడంతో బుధవారం నాడు ఫలితాలను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.

Updated Date - 2023-05-10T12:50:02+05:30 IST