Hyderabad: చిన్న వర్షానికే మునిగిన కారు.. గర్భిణీ ఇలా బయటపడింది.. లేదంటే..!
ABN , First Publish Date - 2023-07-03T16:04:35+05:30 IST
భాగ్యనగరం చిన్నపాటి వర్షానికే అల్లాడిపోతోంది. గతరాత్రి (ఆదివారం) కురిసిన కొద్దిపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపించాయి. ఇందుకు గబ్బిబౌలిలో జరిగిన దుర్ఘటనే ఉదాహరణ. ఓ గర్భిణీ అతికష్టం మీద ప్రాణాలతో బయటపడింది. లేదంటే జరగరాని ఘోరం జరిగిపోయేది.
హైదరాబాద్: భాగ్యనగరం (Hyderabad) చిన్నపాటి వర్షానికే అల్లాడిపోతోంది. గతరాత్రి (ఆదివారం) కురిసిన కొద్దిపాటి వర్షానికే రోడ్లు చెరువులను తలపించాయి. ఇందుకు గబ్బిబౌలిలో జరిగిన దుర్ఘటనే ఉదాహరణ. ఓ గర్భిణీ అతికష్టం మీద ప్రాణాలతో బయటపడింది. లేదంటే జరగరాని ఘోరం జరిగిపోయేది.
ఇటీవల బెంగళూరులో సడన్‌గా వర్షం కురవడం.. బ్రిడ్జి క్రింద నుంచి వెళ్తున్న కారులోకి నీరు ప్రవేశించి ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అలాంటి ఘటనే గత రాత్రి హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. స్నేహితులు వేగంగా స్పందించడంతో ఓ గర్భిణీ సహా కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే దారుణమే జరిగేది. ఈ ఘటన ఓఆర్ఆర్ వట్టేనాగులపల్లి దగ్గర జరిగింది.
వివరాల్లోకి వెళ్తే..
గచ్చిబౌలి ఓఅర్అర్ వట్టేనాగులపల్లి దగ్గర అర్ధరాత్రి ఓ గర్భిణికి (pregnant woman)పెను తప్పిన ప్రమాదం తప్పింది. నిన్నరాత్రి ఫ్యామిలీతో గర్భిణీ స్త్రీ బీఎండబ్ల్యూ కారులో వెళ్తోంది. కారులో వెళ్తుండగా అప్పటికే కురిసిన వర్షపు నీరు (rain water) లోపలికి వచ్చేసింది. దీంతో కారు సగం వర్షపునీరుతో మునిగిపోయింది. దీంతో కుటుంబ సభ్యులంతా బెంబేలెత్తిపోయారు. సమాచారం అందుకున్న స్నేహితులు.. హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని కారులో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీశారు. వరద నీటిలో నుంచి ప్రాణాలతో బయటపడడంతో కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. కారు మాత్రం రాత్రంతా వర్షపునీటిలోనే ఉండి పోయింది. స్నేహితులు.. టోయింగ్ వెహికల్ తీసుకొచ్చి బీఎండబ్ల్యూ కారును (car) బయటకు తీశారు. ఈ తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో గర్భిణీ తిరుపతికి వెళ్లిపోయింది. ఓఆర్ఆర్ ఇంజనీరింగ్ లోపాల వల్లే ఈ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది.