T.Highcourt: అమ్నేసియా పబ్ కేసులో కీలక మలుపు

ABN , First Publish Date - 2023-04-25T13:35:45+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

T.Highcourt: అమ్నేసియా పబ్ కేసులో కీలక మలుపు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసులో (Amnesia Pub Case) కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో వక్స్ బోర్డ్ చైర్మన్ కొడుకుని మైనర్‌గా పరిగణిస్తూ హైకోర్టు (Telangana High Court) ఆదేశాలు జారీ చేసింది. జువెనైల్ కోర్టులో మేజర్‌గా పరిగణిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలపై వక్స్ బోర్డ్ చైర్మన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కాసేపటి క్రితమే హైకోర్టులో వాదనలు జరుగగా వక్స్ బోర్డ్ చైర్మన్‌ కొడుకును మైనర్‌గా పరిగణిస్తూ.. ఫోక్సో చట్టం కింద విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది.

అమ్నేసియా పబ్ కేసులో వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు నిందితుడిగా ఉన్నాడు. గతంలో అతనికి పోటేన్సీ టెస్ట్ చేసి, మేజర్‌గా పరిగణించాలని జువెనైల్ కోర్టును పోలీసులు కోరారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన జువైనల్ కోర్టు.. నిందితుడిని మేజర్‌గా పరిగణిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే జువెనైల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితుడి తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు.. జువెనైల్ కోర్టు తీర్పును తప్పు పడుతూ.. నిందితుడు మైనర్ అంటూ తీర్పునిచ్చింది.

కాగా.. 2022 మే 28 స్నేహితులతో కలిసి ఫ్రెషర్స్ పార్టీకి వెళ్లిన బాలికపై సామూహిక హత్యాచారం జరగడం కలకలం రేపింది. ఈ విషయాన్ని బాలిక స్వయంగా మీడియాకు తెలియజేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులలో వక్స్ బోర్డ్ చైర్మన్ కుమారుడు ఉన్నాడు. అయితే నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా.. 2022 సెప్టెంబర్ 30 నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువెనైల్ జస్టిస్ బోర్డు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జువెనైల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వక్స్ బోర్డ్ చైర్మన్ హైకోర్టుకు ఆశ్రయించారు. దీంతో వక్స్ బోర్డ్ చైర్మన్‌ కొడుకును మైనర్‌గా పరిగణిస్తూ హైకోర్టు తీర్పును వెల్లడించింది.

Updated Date - 2023-04-25T13:41:44+05:30 IST