Delhi: కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తెరపైకి మరో వివాదం

ABN , First Publish Date - 2023-02-17T11:26:08+05:30 IST

కేంద్ర (Central), తెలంగాణ రాష్ట్ర (Telangana State) ప్రభుత్వాల మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. స్మార్ట్ సిటీలకు (Smart Cities) నిధులు (Funds) విడుదల.. రెండు ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణమవుతోంది.

Delhi: కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తెరపైకి మరో వివాదం

ఢిల్లీ: కేంద్ర (Central), తెలంగాణ రాష్ట్ర (Telangana State) ప్రభుత్వాల మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. స్మార్ట్ సిటీలకు (Smart Cities) నిధులు (Funds) విడుదల.. రెండు ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణమవుతోంది. తమ వాటా కింద ఇచ్చే నిధులను కేంద్రం విడుదల చేస్తున్నా... తెలంగాణ ప్రభుత్వం తన వాటాను విడుదల చేయడం లేదని కేంద్రం ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఇలానే ఉంటే ఇక తాము నిధులు విడుదల చేయలేమని కేంద్రం స్పష్టం చేసింది.

ఈ వార్త కూడా చదవండి...

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై నేడు ‘సుప్రీం’ విచారణ..

స్మార్ట్ నగరాల మిషన్ కింద తెలంగాణలోని గ్రేటర్ వరంగల్ (Greater Warangal), కరీంనగర్ (Karimnagar) జిల్లాలు ఎంపిక అయ్యాయి. స్మార్ట్ సిటీ మిషన్ మార్గదర్శకాల ప్రకారం స్మార్ట్ సిటీస్‌గా ఎంపికైన నగరాలకు కేంద్రం నుంచి రూ. 500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 500 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కాగా స్మార్ట్ సిటీస్‌గా ఎంపికైన నగరాల్లోని ప్రాజెక్టుల పూర్తి ఈ ఏడాది జూన్ 23తో ముగియనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాగా ఇవ్వాల్సి నిధులు ఇంత వరకు ఇవ్వలేదని కేంద్రం ఆరోపించింది. స్మార్ట్ సిటీస్‌గా ఎంపికైన నగరాలకు దేశంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిధులు ఇవ్వని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Updated Date - 2023-02-17T11:37:15+05:30 IST