TS High Court: సింగరేణి ఎన్నికలపై హైకోర్టుకు కేంద్ర కార్మిక శాఖ
ABN , First Publish Date - 2023-10-07T19:25:57+05:30 IST
సింగరేణి ఎన్నికల( Singareni election)పై తెలంగాణ హైకోర్టు(TS High Court)ను కేంద్ర కార్మిక శాఖ ఆశ్రయించింది.
హైదరాబాద్: సింగరేణి ఎన్నికల( Singareni election)పై తెలంగాణ హైకోర్టు(TS High Court)ను కేంద్ర కార్మిక శాఖ ఆశ్రయించింది. కార్మిక సంఘం ఎన్నికలకు సింగరేణి యాజమాన్యం సహకరించడం లేదని పిటిషన్ వేసింది. ఈ పిటీషన్ కేంద్ర కార్మిక శాఖ టీఎస్ హైకోర్టులో ఏం చెప్పిందంటే.. ‘‘గత నెల 27వ తేదీన మీటింగ్ పెడితే సింగరేణి యాజమాన్యం హాజరు కాలేదు. సింగరేణి యాజమాన్యం తుది ఓటరు జాబితాను ప్రకటించలేదు. కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 28వ తేదీన ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూలు చేశాం. సింగరేణి సహాయ నిరాకరణ వల్ల ఎన్నికలకు ముందుకెళ్ల లేకపోతున్నాం. ఎన్నికల నిర్వహణకు సహకరించాలా సింగరేణి యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి’’ అని కేంద్ర కార్మిక శాఖ పిటీషన్‌లో తెలిపింది. కేంద్ర కార్మిక శాఖ తరఫున డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాసులు మధ్యంతర పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టులో వేశారు. సింగరేణి అప్పీలుతో కలిపి కేంద్ర కార్మిక శాఖ పిటిషన్‌పై ఈనెల 11వ తేదీన సీజే ధర్మాసనం విచారణ జరపనున్నది.