Hyderabad : రేపు లక్ష మందితో చంద్రబాబు కృతజ్ఞత సభ..ABN లో ప్రత్యక్ష ప్రసారం
ABN , First Publish Date - 2023-10-28T08:53:32+05:30 IST
హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమం నిర్వహించడానికి సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా లక్ష మందితో బాబు కృతజ్ఞత సభ జరగనుంది. సాయంత్రం సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు జరగనుంది.
హైదరాబాద్: తెలుగుదేశం అధినేత (TDP Chief) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కార్యక్రమం (Gratitude Concert Programme) నిర్వహించడానికి సైబరాబాద్ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియం (Gachibowli Stadium) వేదికగా లక్ష మందితో బాబు కృతజ్ఞత సభ జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు జరగనుంది. ఈ సభకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. దీంతో నిర్వాహకులు గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి భారీగా చంద్రబాబు అభిమానులు హాజరుకానున్నారు.
నేటికి 50 రోజులు
కేసు అక్రమం! అరెస్టు ఒక అక్రమం! అసలు రిమాండే ఉండదనుకున్నారు. రిమాండ్‌కు పంపినా వెంటనే బెయిలు వస్తుందని భావించారు. కింది కోర్టు కాదంటే పైకోర్టులోనైనా ఉపశమనం లభిస్తుందని ఆశించారు. కానీ... ఇవేవీ జరగలేదు. చంద్రబాబు నిర్బంధానికి శనివారంతో 50 రోజులు పూర్తయ్యాయి. ఆయనను స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో గత నెల 9వ తేదీన నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజున ఏసీబీ కోర్టు ఆయనను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. అప్పటి నుంచి ఆయన రాజమహేంద్రవరం జైల్లోనే ఉన్నారు.
చంద్రబాబు అరెస్టు... జైలువాసం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయన రెండు మూడు రోజుల్లోనే బయటకు వచ్చేస్తారన్న అభిప్రాయంతో మొదట్లో ఈ అరెస్టుపై ప్రజా స్పందన అంతగా కనిపించలేదు. కానీ తర్వాత నిరసనల హోరు పెరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో కూడా భారీగా ప్రజలు రోడ్ల పైకి వచ్చి ప్రదర్శనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ముప్పైకిపైగా దేశాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ఎంత తీవ్రంగా అడ్డుపడినా... కేసులు పెట్టినా నిరసన కార్యక్రమాలు ఆగలేదు. గుంటూరు, విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో మహిళలు స్వచ్ఛందంగా కదిలి రోడ్ల పైకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరిపారు. అన్ని జిల్లాల్లో నిరాహార దీక్షలు జరిగాయి. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మోత మోగిద్దాం, జగనాసుర దహనం, న్యాయానికి సంకెళ్లు వంటి కార్యక్రమాలను వారానికొకటి చొప్పున జరిగాయి. వీటిలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అప్‌లోడ్ కావడంతో ట్రెండింగ్‌లోకి వెళ్లాయి. ఈ అంశాన్ని నేషనల్ టీవీ చానళ్లు కూడా పెద్ద ఎత్తున కవర్ చేశాయి. సాధారణంగా దక్షిణాదిలో జరిగే కార్యక్రమాలను హిందీ, ఇంగ్లీషు చానళ్లు పట్టించుకోవు. కానీ... ఇతర రాష్ట్రాల్లోని నగరాల నుంచి వచ్చిన చానళ్ల ప్రతినిధులు విజయవాడలో మకాం వేసి చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన వార్తలు అందించాయి.